Site icon NTV Telugu

Ganesh Chaturthi 2025: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? అసలు కథ ఇదే..

Ganesh Chaturthi

Ganesh Chaturthi

హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో గణేష్​ చతుర్థి ఒకటి. ఈ పండుగ సందర్భంగా జరిగే గణేష్ నవరాత్రులు భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత పదవ రోజు జరిగే గణేశ్ నిమజ్జనంతో పండుగ ముగిసిపోతుంది. తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి తిథి ఆగస్టు 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:54 గంటలకు మొదలై, ఆగస్టు 27, బుధవారం మధ్యాహ్నం 3:44 గంటల వరకు కొనసాగుతుంది. ఓ కథ గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. వినాయకుడి ప్రతిమ ముందు అందరూ సాధారణంగా గుంజీలు తీస్తుంటారు. అసలు ఎందుకు ఇలా తీస్తారు. దీనికి వెనకున్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

READ MORE: Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి నాడు చంద్రుణ్ణి అస్సలు చూడొద్దు! పొరపాటున చూస్తే ఏం చేయాలి?

పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన పరమేశ్వరుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. మంచి భోజన ప్రియుడు. పైగా మన బొజ్జ గణపయ్యకు ఆకలి కూడా కాస్త ఎక్కువే ! బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం, ఆయనకీ పార్వతీ దేవి చేసిపెట్టే, మురుకుల చక్రం లాగా కనిపించింది కాబోలు, చట్టుక్కున నోట్లో వేసుకుని మింగేసి, అమాయకంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణుమూర్తి , దాన్ని ఎక్కడ ఉంచానా అని వెతకడం మొదలుపెట్టారు. మామయ్యా ఏం వెతుకుతున్నారో అర్థం కాక, చల్లగా వచ్చిన చిన్నారి గణపయ్య ‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’ అని అమాయకంగా అడిగాడు. “ఇక్కడే నా సుదర్శన చక్రాన్ని పెట్టాను అల్లుడూ ! కంపించడం లేదు. ఆ చక్రాన్ని వెతుకున్నా” అన్నారు శ్రీ మహావిష్ణువు.

READ MORE: Srikakulam Floods: చెరువులను తలపిస్తున్న రహదారులు, 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదు

“ఓ అదా! గుండ్రంగా , నొక్కులు నొక్కులుగా భలే ఉందని నేనే నోట్లో వేసుకున్నా మామయ్య!”అని చిరు దరహాసం ఒలికించాడు బుజ్జి గణపతి . అసలే సుందరాకారుడు . చిన్నారి రూపంలో చిలిపి చేష్టలు చేస్తుంటే , ముచ్చట పడిపోడా ఆ మామయ్య మహావిష్ణువు. వెంటనే అల్లుణ్ణి బుజ్జగించి చక్రాన్ని దక్కించుకొనే పనిలో దిగాడు . ‘బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహా సుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా’ అని నానారకాలుగా బ్రతిమిలాడుకున్నారు . అయినా సరే , మన బొజ్జ గణపయ్య బొజ్జ నిమురు కుంటారే గానీ, చక్రాన్ని బయటపడేసే మార్గం మాత్రం ఆలోచించరు. జగమేలే మామయ్యకి మాయోపాయాలకి తక్కువా ? ఆయన చిన్నారి గణపతిని మాటల్లో పెట్టి , తన కుడి చేతితో తన ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందుర గుంజీలు తీయడం ఆరంభించారు. విష్ణుమూర్తి మామయ్య చేసిన ఈ పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి పుట్టేంతగా నవ్వారు. అలా నవ్వుతూండగా , ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం అదే అదననుకొని , గబుక్కున బయటపడింది. చక్రం చిక్కిందిరా నాయనా అని ఊపిరి పీల్చుకున్నారు శ్రీ మహావిష్ణువు. ఇలా అప్పటి నుంచి గణపతి ముందు గుంజీలు తీసే సంప్రదాయం వచ్చింది అని హరికథా భాగవతులు సరదాగా కథ చెప్పేవారు. ఆ విధంగా గణపతి ప్రసన్నుడై, శ్రీమహావిష్ణువు చక్రాన్ని తిరిగి ఇచ్చేశారు . కాబట్టి గణపతి ముందు గుంజీలు తీసి ఏదైనా కోరుకుంటే, ఆనందపడి మనము కోరిన కోర్కెలు కూడా తీరుస్తారట విఘ్నేశ్వరుడు.

READ MORE: Palnadu: ఏఆర్ కానిస్టేబుల్‌ను వేధించిన మహిళ.. సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో!

అంతే కాదు.. సైన్స్ పరంగానూ గుంజీలకు మంచి ప్రాధాన్యత ఉంది. మన చెవులకు చివర ఉన్న తమ్మెలు అంటే కమ్మలు ధరించే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే మెదడులోని బుద్ధికి సంబంధించిన నరాలు చురుగ్గా పని చేసి తెలివితేటలు పెరుగుతాయని శాస్త్రజ్ఞులు చెబుతారు. అందుకే విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తెస్తే బుద్ధి పెరుగుతుందని అంటారు.

Exit mobile version