NTV Telugu Site icon

Friday : మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికి ఉండాలంటే పొద్దున్నే లేవగానే ఈ పని చెయ్యాల్సిందే..

Lashmi

Lashmi

శుక్రవారం అంటే మహాలక్ష్మి వారం అని పిలుస్తారు.. అందుకే ఈరోజు అమ్మవారి కటాక్షం కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.. లక్ష్మీదేవి చల్లని చూపు ఉన్న కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారు.. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పటికి మీపై ఉండాలంటే మాత్రం ఇలా చెయ్యాల్సిందే.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెల్లవారుజామున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ దేవత తులసి మొక్కలో నివసిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ప్రతి శుక్రవారం తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. రోజు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి తులసి మొక్కకు రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి.. ఇలాంటి మొక్కకు నీళ్లు పోస్తున్న సమయంలో విష్ణు మాత్రాన్ని జపించాలి..

ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్రాల ప్రకారం స్నానం చేసిన తర్వాత కలశంలో వెర్మిలిన్, పువ్వులు ఉంచి సూర్య భగవానుడికి సమర్పించాలి. అలా చెయ్యడం వల్ల ఆ తల్లి లక్ష్మి సంతోషిస్తుంది. దీంతో పాటు మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇలా ప్రతి రోజు ఉదయం పూజ చేసిన తర్వాత నుదుటి పై చందన తిలకం రాసుకోవాలి.. అప్పుడే మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.. రోజు ఉదయం ఇంటినీ శుభ్రపరచేటప్పుడు ఉపయోగించే నీటిలో ఉప్పు వేస్తే అది ప్రతికూలతను తొలగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి పై ఎప్పుడు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని ప్రతి రోజు శుభ్రం చేయాలి.. అప్పుడే లక్ష్మి దేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది.. మీకు ఆర్థిక సమస్యలు రావు.

Show comments