NTV Telugu Site icon

Famous Rama Temples : భారతదేశంలో పురాతనమైన రామాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

Rama

Rama

అయోధ్య రాముడు హిందువుల ఆరాధ్య దైవం.. ఎంతో మంది రాముడు గురించి ఎన్నో కథనాలు రాసారు.. ఒక్కో కథనం రాముడు గురించి అనేక అంశాలను తెలియ జేస్తుంది.. రాముడు నెలకొల్పిన విలువలను ఒకేలా ఆయా కావ్యాలు వివరించాయి. జనవరి 22 న అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకను జరుపుకోవడానికి భారతీయులు సన్నద్ధమవుతున్నారు.. బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో.. భారతదేశంలో అంతగా ప్రసిద్ధి చెందిన ఏడు రామాలయాల గురించి వివరంగా తెలుసుకుందాం..

శ్రీకోదండ రామాలయం- ఆంధ్రప్రదేశ్, ఒంటిమిట్ట…

శ్రీ కోదండరామ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, వొంటిమిట్ట మండలం, వొంటిమిట్ట పట్టణంలో ఉంది. పూర్వ నిషాద వంశానికి చెందిన దొంగలు వొంటుడు, మిట్టుడు అనే వాళ్లు రామ భక్తులుా మారి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వారి భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.. ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది..

ఎరి-కథా రామర్ ఆలయం- మధురాంతకం, తమిళనాడు..

తమిళనాడులోని మధురాంతకంలో ఉన్న ఎరి-కథా రామర్ ఆలయం రామాయణ కథనంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. లంకలో రావణాసురుడిని వధించిన తరువాత, శ్రీరాముడు, సీతా లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయంలో మధురాంతకంలో కొద్ది సేపు ఆగారని భక్తులు విశ్వసిస్తారు.

రామ్ తీర్థ్ ఆలయం- అమృత్ సర్, పంజాబ్..

పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న రామ్ తీరథ్ ఆలయం రాముడు, సీత కుమారులైన లవ, కుశుల జననానికి సంబంధించినది. ఈ ఆలయం దాని పురాతన బావికి ప్రసిద్ధి చెందింది. ఆ బావిలోని నీటిలో ఔషధ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. అలాగే గర్భిణిగా వచ్చిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పించిన ప్రదేశం కూడా ఇదేనని ప్రజలు నమ్ముతారు..

కోదండ రామాలయం- చిక్ మగళూరు, కర్నాటక..

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా హీరేమగళూరులో కొలువై ఉన్న కోదండరామస్వామి ఆలయం స్కంద పురాణం లో ఉన్న ఒక విశిష్ట సంఘటనతో ముడిపడి ఉంది. స్కంద పురాణం ప్రకారం, శ్రీరాముడు సీతామాతను వివాహం చేసుకున్నప్పటి భంగిమలో పరశురాముడికి దర్శనం ఇస్తాడు..

శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఆలయం- తిరుప్పుకుళి, కాంచీపురం జిల్లా, తమిళనాడు..

తమిళనాడు, కాంచీపురం జిల్లా, తిరుప్పుకుళిలో ఉన్న ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్యదేశాలలో ఒకటి. గర్భగుడి లోపల, విజయరాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువును చిత్రీకరించారు. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు తనకు సీతాదేవి వివరాలను చెప్పిన జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసినట్లుగా భక్తులు నమ్ముతారు..

రామ్ రాజా టెంపుల్ – ఓర్చా, మధ్యప్రదేశ్..

ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.. చాలా పురాతనమైన ఆలయం కూడా.. ఇది మధ్యప్రదేశ్ లోని ఓర్చాలో ఉన్న రామ్ రాజా టెంపుల్, రాజ ప్రసాదం సెట్టింగ్ లో రాముడిని రాజుగా ఆరాధించే ఏకైక ఆలయంగా ప్రత్యేకమైనది. ఇక్కడ శ్రీరాముడు మహారాజుగా దర్శనమిస్తాడు. మహారాజులకు ప్రతీ రోజు ఇచ్చే గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఖడ్గం, కవచం పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తారు..

త్రి స్రయార్ శ్రీ రామాలయం- కేరళ..

కేరళలోని త్రిస్సూర్ జిల్లా, త్రి ప్రయార్ లో ఉన్న త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయంలో కృష్ణుడు ఆరాధించిన శ్రీరాముడి విగ్రహం ఉంది. దశరథ మహారాజు నలుగురు కుమారులైన రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఉన్న నాలుగు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిది… ఈ ఆలయాలు అన్ని మన దేశంలోని ఎంతో పురాతనమైన రామాలాయాలు..

Show comments