NTV Telugu Site icon

Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా.. నిజమేంటంటే?

Dreams

Dreams

సాదారణంగా మనం గాఢ నిద్రలోకి వెళ్లినప్పుడు కలలు రావడం సహజం.. ఎక్కువ శాతం రాత్రి సమయంలో చాలామందికి అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే ఉదయం పూట వచ్చే కలలు నిజం అవుతాయని జనాలు నమ్ముతారు.. నిజంగానే అవి నిజామావుతాయా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నిద్రను నాలుగు భాగాలుగా చెబుతూ ఉంటారు. అందులో మొదటి భాగంలో వచ్చిన కలలు ఏడాది తర్వాత చెడు ఫలితాలను ఇస్తాయి.రెండవ భాగంలో వచ్చిన కలలు 6 నుంచి 12 నెలల్లో ఫలితాన్నిస్తాయి. ఇక మూడవ భాగంలో వచ్చిన కలలు 3 నుంచి 6 నెలల్లో ఫలితాన్నిస్తాయి. ఇక నాల్గవ భాగంలో వచ్చిన కలలు 1 నుంచి 3 నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఏదైనా కల సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు వచ్చినట్టైతే దాని ఫలితాన్ని సుమారు 15 రోజుల్లో ఉంటుందని అర్థం.. నిద్రలో వచ్చిన కలలో నెత్తి మీద మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకున్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.. ఏదైనా చెడు జరుగుతుందని సంకేతం.. కొంచెం జాగ్రత్తగా ఉండాలి..

అలాగే పాములను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలు, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా కనిపించడం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం ఇలా చాలా వాటిని చెడు కలలుగా భావిస్తారు.. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.. మంచి కలల విషయానికొస్తే..కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కాళ్లు, చేతులు కడుగుతున్నట్లు కల వస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయి. పెద్దలు దీవిస్తున్నట్లు, పాలు, నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని అర్థం.. అలాగే ప్రయాణాలు చేస్తున్నట్లు వస్తే త్వరలోనే మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సంకేతం..