NTV Telugu Site icon

Diwali special : ఈరోజు ఏ దిశలో దీపాలు వెలిగిస్తే మంచిదో తెలుసా?

Diwaali

Diwaali

చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా, కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఒకటి.. కార్తీక కృష్ణ పక్షంలోని చతుర్దశిని నకర చతుర్దశి అని కూడా పిలుస్తారు. నరక సురుడికి నకర చతుర్దశి రోజు సాయంత్రం 4 దీపాలు వెలిగిస్తారు..ఇది అనాతి కాలం నుంచి వస్తుంది.. ఈ దీపాలను దక్షిణ దిశలో వెలిగించాలి. భవిష్య పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు,శివ వంటి దేవతల దేవాలయాలలోనీ మఠాలలో, ఆయుధ శాలలలో అంటే ఆయుధాలు మొదలైన వాటిలో తోటల దగ్గర ఇంటి ప్రాంగణంలో ఉన్న నదుల దగ్గరలో ఈ దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు..

చీకటిని తరిమే ఈ దీపాలు ఇంట్లో ఒక్కటైనా వెలిగించాలి.. అప్పుడే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.. నరక చతుర్దశి రోజు దీపాలను వెలిగించాలని శాస్త్రం చెబుతోంది.వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి.. ఇలాంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అలాగే దీపం వెలిగించే పళ్లెంలో బంగారం లేదా వెండి ఆభరణాలను ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంట్లో దక్షిణం వైపుగా దీపం అస్సలు వెలిగించకూడదు.. ఇది తప్పక గమనించాలి..

ఇలా వెలిగిస్తే ఇంట్లో అరిష్టం పడుతుంది.. ఇక చివరగా ఇంటికి తూర్పు వైపు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమం వైపు కూడా దీపం వెలిగించడం ఆ ఇంటికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో సమస్యలు అన్ని తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. ఇంట్లో మొత్తం దీపాలతో నింపడంతో ఇంట్లోకి అతీత శక్తులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..