Dhanteras 2025: దేశవ్యాప్తంగా దీపాల పండుగ ప్రారంభానికి గుర్తుగా నేడు భక్తులందరూ ధన్ తేరాస్‌ను జరుపుకుంటున్నారు. వాస్తవానికి దీనిని ధన్ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు భక్తులందరూ ధన్వంతరిని పూజిస్తారు. హిందూవులు ఆయనను విష్ణువు అవతారంగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. సముద్ర మధనం చేస్తున్న సమయంలో ధన్వంతరి అమృత కుండతో బయటికి వచ్చారని చెబుతారు. దీంతో ఆయనను ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొన్నారు. ఈ రోజున కొన్ని వస్తువులను కొనడం చాలా శుభప్రదం అని, అయితే కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం అని అంటున్నారు. వాస్తవానికి ఈ రోజు కొన్ని వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏమిటో, వాటి వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం.
READ ALSO: Airtel Recharge Plan: అపరిమిత 5G డేటా, ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్.. అన్నీ ఒకే ప్లాన్‌లో
చక్కెర: ధన్ తేరస్ నాడు మీ వంటగది నుంచి ఎవరికైనా చక్కెరను ఇవ్వడం అశుభంగా చెబుతున్నారు. చక్కెర అనేది తీపి, ఆనందాన్ని సూచిస్తుందని అంటారు. ధన్ తేరస్ నాడు మీరు ఎవరికైనా చక్కెర ఇస్తే, మీరు మీ ఇంటి తీపి, ఆనందాన్ని వేరొకరికి అప్పగించినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ధన్ తేరస్ రాత్రి చక్కెరను ఎవరికీ ఇవ్వకూడదని హిందూ శాస్త్రాలు చెబుతున్నారు.
డబ్బు: ధన్ తేరస్ అనేది సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని ఆరాధించడానికి అంకితం చేసిన రోజు. ఈ రోజు డబ్బు అప్పుగా ఇవ్వడం అశుభంగా చెబుతున్నారు. ఒకవేళ ఇలా డబ్బు అప్పుగా ఇవ్వడం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుందని హెచ్చరిస్తున్నారు.
ఉప్పు: ఉప్పును స్వచ్ఛత, సమతుల్యతకు చిహ్నంగా భావిస్తారు. అయితే ధన్ తేరస్ రోజు మీ వంటగది నుంచి ఎవరికైనా ఉప్పు ఇవ్వడం అంటే మీ జీవితంలోని శక్తి, స్థిరత్వాన్ని ఇతరులకు దారబోసిన దానితో సమానం అంటున్నారు. వాస్తవానికి ఉప్పు అనేది సముద్రం నుంచి వచ్చింది, అలాగే లక్ష్మీ దేవి కూడా సముద్ర మధనం నుంచి బయటకి వచ్చింది.. కాబట్టి ఉప్పుతో లక్ష్మీదేవికి సంబంధం ఉందని చెబుతున్నారు.
పాలు, పెరుగు: ధన్ తేరస్ రాత్రి మీ ఇంట్లో నుంచి పాలు, పెరుగు ఎవరికీ ఇవ్వకూడదని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజు పాలు లేదా పెరుగు ఇవ్వడం వల్ల అది గ్రహాల దిశను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. పాలు, పెరుగు శుభం, స్వచ్ఛతకు చిహ్నాలుగా పేర్కొంటున్నారు. దీంతో ధన్ తేరస్ వంటి శుభపర్వదినం రోజున వాటిని ఇతరులకు ఇవ్వడం అశుభంగా చెబుతున్నారు.
READ ALSO: Putin: హంగేరీకి రష్యా అధ్యక్షుడు .. పుతిన్ అరెస్టుపై అనుమానాలు?
