Site icon NTV Telugu

Buddha Statue: లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిదో తెలుసా?

Buddha New

Buddha New

లాఫింగ్ బుద్ధ గురించి అందరికి తెలుసు.. వాస్తు దోషాలు పోవడానికి,వ్యాపారాల్లో మంచి లాభాలను పొందేందుకు లాఫింగ్ బుద్దను పెడుతుందటం మనం చూస్తూనే ఉంటాం, చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధుని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధను ఏర్పాటు చేయడానికి సరైన స్థానం, సరైన దిక్కు ఏంటి ఈ విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేర్వేరు రకాలలో ఉండే బుద్ధుని భంగిమలు వేర్వురు రకాల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, సంపద, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటారు…

అయితే ప్రతికూల పరిస్థితులు బాగుండాలని ఈ లాఫింగ్ బుద్దను పెడతారు.. లాఫింగ్ బుద్దను ఇంట్లో పెట్టడం వల్ల ప్రశాంతత లభిస్తుందని జనాలు ఎక్కువగా నమ్ముతారు.. అయితే మీ ఇంట్లో ఈ దిశలలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచితే మీకు సరైన శక్తి ఉత్పత్తి చేయడంతో పాటు మీ సంపదర పెరుగుతుందట. ఇంటి ప్రధాన ముఖద్వారం వద్ద లాఫింగ్ బద్ధుని విగ్రహాన్ని ఉంచాలి. అది మీకు కంటికి కనబడేలా తక్కువ ఎత్తులా ఉండేలా చూసుకోవాలి.. మరీ ఎత్తులో ఉండకుండా చూడటానికి వీలుగా ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిది..

బుద్ధుడు ఇంట్లో ఉండటం వల్ల ఒత్తిడి దూరం అవ్వడమే కాదు.. ఆర్ధిక ఇబ్బందులు కూడా తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఇంట్లోని ప్రవేశ ద్వారం వద్ద బుద్ధుడు ఆశీర్వాద భంగిమలో ఉండేలా చూసుకోవాలి. ఇలా బుద్ధుని విగ్రహంను ఇంట్లో ఉంచడం వల్ల వ్యతిరేక శక్తులు అన్నీ ఇంటి నుండే బయట ఉండిపోతాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం బుద్ధుడిని పడమర వైపు దిశ వైపు చూస్తున్నట్టుగా గదిలో కుడివైపుగా ఉంచితే మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీకు సాయంత్రం వేళ తోటలో లేదా పార్కుల్లో నడిచే అలవాటు ఉంటే అక్కడ ఒక పరి శుభ్రమైన ప్లేసులో ద్యానం చేస్తున్న బుద్ధుడిని ఉంచడం మంచిది.. అంతేకాదు ఆ విగ్రహం చుట్టు దీపాలు పెట్టడం వల్ల ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది..

Exit mobile version