Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yezdi Scrambler 350: భారత మార్కెట్లో క్లాసిక్ స్టైల్ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యెజ్డీ (Yezdi) తన సరికొత్త Scrambler 350 మోడల్‌ను విడుదల చేసింది. ఈ బైక్ నేరుగా రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్లకు పోటీగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ యువతను ఆకట్టుకునేలా రూపొందించారు. క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యెజ్డీ సంస్థ, తన మోటార్‌సైకిల్ లైనప్‌లో ఈ కొత్త స్క్రాంబ్లర్‌ను చేర్చింది. నగర ప్రయాణాలు, వీకెండ్ లాంగ్ రైడ్స్, ఆఫ్-రోడింగ్ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను డిజైన్ చేశారు. స్టైల్‌తో పాటు పనితీరు కూడా కోరుకునే రైడర్లకు ఇది సరైన ఎంపికగా నిలవనుంది.
ధర ఎంత?
Yezdi Scrambler 350 ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,99,950గా నిర్ణయించారు. ఈ ధరలో లభించే ఫీచర్లు, పవర్ చూసినప్పుడు ఇది ప్రీమియం సెగ్మెంట్లో మంచి ఆప్షన్‌గా భావిస్తున్నారు.
Also Read
- Aprilia SR 175: కొత్త థీమ్‌తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
- Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న SUV
- Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
- Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
ఇంజన్, పనితీరు ఎలా ఉంది?
ఈ బైక్‌లో 334cc ఇంజన్ అందించారు. ఇది 8100 rpm వద్ద 30 PS పవర్, 6750 rpm వద్ద 30 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం ప్రత్యేకంగా 30-30-30 ఫార్ములాను అనుసరించింది. అంటే.. 30 PS పవర్, 30 Nm టార్క్, 30 km/l మైలేజీగా ఉంది.. ఈ ఫార్ములా ద్వారా పనితీరు, మైలేజీ, డ్రైవింగ్ అనుభవం మధ్య సమతౌల్యం సాధించామని కంపెనీ చెబుతోంది.
డిజైన్ ఎలా ఉంది?
సాంప్రదాయ స్క్రాంబ్లర్ స్టైల్‌ను కొనసాగిస్తూ బైక్‌ను రూపొందించారు. ఇందులో.. ఎత్తైన ముందు భాగం.. కాంపాక్ట్ టెయిల్ సెక్షన్, ఓవల్ షేప్ సైడ్ ప్యానెల్స్.. సింగిల్ పీస్ సీట్ వంటి డిజైన్ అంశాలు ఉన్నాయి. దీంతో బైక్‌కు రగ్గడ్ మరియు క్లాసిక్ లుక్ వచ్చింది.
ఫీచర్లు ఇవే
ఈ బైక్‌లో ఆధునిక ఫీచర్లను కూడా జోడించారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.. LED హెడ్‌లైట్, ప్రత్యేకమైన LED టెయిల్ ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్.. ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్..
బరువు, సీట్ హైట్
ఈ బైక్ బరువు 174 కిలోలు మాత్రమే. తన సెగ్మెంట్లో తక్కువ బరువు కలిగిన బైక్‌లలో ఇది ఒకటిగా నిలుస్తోంది. అలాగే 813 మిమీ సీట్ ఎత్తు ఉండటంతో చాలా మంది రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది.
కలర్స్ ఏవి?
Yezdi Scrambler 350 నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది: Legacy Black, OG Yellow, Rogue Red, Rally Blue.. ప్రతి కలర్‌కు ప్రత్యేక గ్రాఫిక్స్ ఇవ్వడంతో మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఎవరికి బెటర్?
రోజువారీ ప్రయాణాలు చేసే వారికి, వీకెండ్ రైడ్స్ ఇష్టపడేవారికి, అలాగే ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్ కోరుకునే వారికి ఈ బైక్ మంచి ఎంపికగా ఉంటుంది. Royal Enfieldకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ఇది మంచి పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
-
Trisha : భారీ రెమ్యునరేషన్ అడిగిన త్రిష.. బిత్తరపోయిన నిర్మాత
-
Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!