NTV Telugu Site icon

Yamaha New Bike : మార్కెట్ లోకి మరో కొత్త యమహా బైక్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

Bikesss

Bikesss

మార్కెట్ లోకి ఈ మధ్య వస్తున్న బైకులపై యూత్ ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇక యూత్ ను ఆకట్టుకొనే విధంగా అనేక ఫీచర్స్ తో సరికొత్త బైకులను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు.. తాజాగా యమహా కంపెనీ మరో కొత్త బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఇందులో యూత్ ఎక్కువగా ఇష్టపడే బైక్ అంటే యమహా. ఈ కంపెనీ నుంచి ఇప్పటికి ఎన్నో మోడల్స్ రిలీజ్ అయ్యాయి. కస్టమర్ల ఆదరణ పొందాయి.ఈ తరుణంలో యమహా కంపెనీ నుంచి యమహా ఎఫ్ జెడ్ ఎక్స్ క్రోమ్ ఎడిషన్ ఆకర్షణీయమైనటువంటి కలర్లలో మనకు అందుబాటులోకి వచ్చింది.. ఆ బైక్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇకపోతే ఈ బైకును బుక్ చేసుకొనే మొదటి 100 మందికి ఫ్రీ బుకింగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.. అద్భుతమైన వాచ్ కూడా ఉచితంగా ఇవ్వబోతోంది. ఇంతకీ అవాచ్ ఏంటంటే క్యాషియో జి షాక్ .. కొత్త కలర్ స్కీం తో పాటు మోటార్ సైకిల్ డిజైన్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు లేవు. ఇక ఈ బైక్ 149CC సింగిల్ సిలిండర్ ఇంజన్. 12.4HP, 13.3nm టర్కు ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ ఐదు స్పీడు గేర్ బాక్స్ తో వస్తుందని చెబుతున్నారు..

అలాగే.. ఎఫ్ జెడ్ ఎక్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, సింగిల్ ఛానల్ ఏబిఎస్, మల్టీ ఫంక్షన్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే బ్యాక్ డిస్క్ బ్రేక్, అలాగే బ్యాక్ మడిగాడ్ తో పాటు, హెడ్ లైట్ వంటి ప్రత్యేకమైనటువంటి ఫీచర్లను కలిగి ఉన్నది.. ఇక ఈ బైక్ బ్రేకింగ్ కోసం ఏబిఎస్ తో 282 ఎమ్ ఎమ్ ఫ్రంట్ డిస్క్, వెనక ఫ్రేమ్ లో 220 ఎమ్ ఎమ్ డిస్క్ ను ఉపయోగిస్తోందట.. అంతేకాకుండా ఈ మోడల్ E20 ఇందనంతో నడుస్తుందట.. ఎక్స్ షో రూమ్ లో దీని ధర రూ. 1.40 లక్షలు ఉందని తెలుస్తుంది..