Site icon NTV Telugu

Yamaha FZ-S Fi: హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి మొట్టమొదటి బైక్‌.. ధర ఎంతంటే?

Yamaha

Yamaha

బైక్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే బైకుల లిస్ట్ లో యమహా FZ-S Fi ఒకటి. యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది ఈ మోడల్. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన మైలేజ్‌తో వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ యమహా భారత మార్కెట్లో స్కూటర్లు, బైకులను రిలీజ్ చేస్తోంది. తాజాగా యమహా హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి మొట్టమొదటి బైక్‌ ను విడుదల చేసింది. 150 సీసీ విభాగంలో దేశంలో మొట్టమొదటి FZ-S FI హైబ్రిడ్ బైక్ ను విడుదల చేసింది.

స్టన్నింగ్ లుక్స్, పవర్ ఫుల్ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1,44,800 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ బుకింగ్‌ను ఈరోజు నుంచి కంపెనీ ప్రారంభించింది. దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. యమహా ఇందులో 149 సీసీ సామర్థ్యం గల బ్లూ కోర్ ఇంజిన్‌ను అందించింది. ఇది స్మార్ట్ మోటార్ జనరేటర్, స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల బైక్‌ను త్వరగా స్టార్ట్ చేయవచ్చు. మంచి మైలేజ్ కూడా లభిస్తుంది. 13 లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్ ఉన్న ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉంది.

ఈ కొత్త FZ-S FI హైబ్రిడ్ బైక్ కు యమహా 4.2-అంగుళాల ఫుల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించింది. వీటిని స్మార్ట్‌ఫోన్, Y కనెక్ట్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనితో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్, గూగుల్ మ్యాప్, రియల్ టైమ్ డైరెక్షన్, నావిగేషన్ ఇండెక్స్, ఇంటర్‌సెక్షన్ వివరాలు వంటి ఫీచర్లు ఇందులో అందించారు. ఇది రేసింగ్ బ్లూ, సియాన్ మెటాలిక్ గ్రే వంటి కలర్స్ లో అందుబాటులో ఉంది. యమహా 150 సిసి విభాగంలో FZ-S FI హైబ్రిడ్‌.. TVS Apache, Hero Xtreme, Honda Unicorn, Bajaj Pulsar వంటి బైకులకు గట్టిపోటినిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version