Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
- యమహా తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్
- Yamaha FZ Flex Fuelను అధికారికంగా విడుదల
- ధర రూ.1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యమహా భారత మార్కెట్లో తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్ అయిన Yamaha FZ Flex Fuelను అధికారికంగా విడుదల చేసింది. పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనాన్ని ఉపయోగించగల ఈ బైక్, పర్యావరణహిత రవాణా వైపు మరో ముందడుగుగా నిలుస్తోంది. E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే సామర్థ్యం ఈ బైక్ ప్రత్యేకత. ఇప్పటికే సుజుకి, హీరో వంటి కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ విభాగంలో అడుగుపెట్టగా, ఇప్పుడు యమహా కూడా ఈ జాబితాలో చేరింది.
149cc ఇంజిన్
Yamaha FZ Flex Fuelలో 149cc సామర్థ్యం గల ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 7,250 rpm వద్ద 11.7 hp పవర్, 6,000 rpm వద్ద 12.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ Yamaha FZతో పోలిస్తే ఈ మోడల్లో పవర్, టార్క్ స్వల్పంగా తగ్గినప్పటికీ, ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కారణంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండటం దీని ప్రధాన ఆకర్షణ.
Also Read
- Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
- 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు
కొత్త FZ Flex Fuel బైక్‌లో గతంలో విడుదలైన FZ Rev మోడల్ తరహాలో LED హెడ్‌ల్యాంప్‌ను అందించారు. అదే మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఫాక్స్ ఎయిర్ వెంట్స్, సింగిల్-పీస్ సీటు డిజైన్ కొనసాగించారు. ఇక 5-స్పీడ్ గేర్‌బాక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్, సింగిల్-ఛానల్ ABS వంటి అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
బ్రేకింగ్, ఫీచర్లు
భద్రత కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు Bosch Single-Channel ABSను అందించారు. పూర్తి డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ స్విచ్, 140 మిమీ వెడల్పు గల రియర్ రేడియల్ టైర్, ఇంజిన్ కౌల్ వంటి ఫీచర్లతో వస్తోంది.
Yamaha FZ Flex Fuel ధర
Yamaha FZ Flex Fuel బైక్ ప్రస్తుతం మెటాలిక్ బ్లాక్ రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ప్రారంభ దశలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో విక్రయించనున్నారు. ధర రూ.1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరతో Yamaha FZ సిరీస్‌లోని మొత్తం మోడళ్లలో ఇది మధ్యస్థ ధర కలిగిన మోడల్‌గా నిలుస్తోంది.
పర్యావరణానికి అనుకూలమైన కొత్త అడుగు
భారత ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో Yamaha తీసుకొచ్చిన FZ Flex Fuel బైక్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా ఈ తరహా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!