505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!

Skynomd

Skynomd

Xiaomi SkyNomad Series: చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) పోర్ట్‌ఫోలియోను పెంచుతూ కొత్తగా SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న SU7 సెడాన్, YU7 SUV తర్వాత కంపెనీ నుంచి వచ్చిన మూడో EV సిరీస్ ఇదే.

కొత్తగా అభివృద్ధి చేసిన Kunlun ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ SUVలు విశాలమైన క్యాబిన్, AI ఆధారిత ఫీచర్లు, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, కుటుంబ ప్రయాణాలకు అనువైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వాహనాలు చైనాలో మాత్రమే అందుబాటులో ఉండగా.. భారత్ సహా ఇతర దేశాల్లో లాంచ్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Kunlun Platform ప్లాట్‌ఫారమ్ కారణంగా క్యాబిన్‌లో పూర్తిగా ఫ్లాట్ ఫ్లోర్ డిజైన్ ను అందించారు. దీంతో ప్రయాణికులకు మరింత లెగ్‌రూమ్ లభిస్తుంది. అవసరాన్ని బట్టి క్యాబిన్‌ను 11 రకాల సీటింగ్ లేఅవుట్‌లుగా మార్చుకునే అవకాశం ఉంది. రోజువారీ ప్రయాణాలు, క్యాంపింగ్, ఆఫీస్ వర్క్ లేదా ఫ్యామిలీ ట్రిప్స్ వంటి విభిన్న అవసరాలకు అనుగుణంగా ఇంటీరియర్‌ను సులభంగా మార్చుకోవచ్చు. ఈ సిరీస్‌లో SkyNomad N90 Max & SkyNomad N70 Max అనే రెండు మోడళ్లు ఉన్నాయి.

N90 Max పొడవు 5,285 మి.మీ, వీల్‌బేస్ 3,080 మి.మీ.గా ఉంటుంది. ఇందులో 7 సీట్లు ఉండగా, గరిష్టంగా 1,831 లీటర్ల లగేజ్ స్పేస్ లభిస్తుంది. మరోకారు N70 Max పొడవు 4,960 మిమీ, వీల్‌బేస్ 2,950 మిమీ. ఇది 5-సీటర్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చింది. SkyNomad Seriesలో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. ఇందులో పవర్ అడ్జస్టబుల్ సీట్లు, నాలుగు జీరో-గ్రావిటీ సీట్లు, 16-పాయింట్ మసాజ్ ఫంక్షన్, హీటింగ్, వెంటిలేషన్, బిల్ట్-ఇన్ రిఫ్రిజిరేటర్‌తో స్లైడింగ్ సెంటర్ కన్సోల్, అలాగే 30కు పైగా స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఈ SUVల్లో కొత్త Kunlun HyperRange Extended-Range Systemను ఉపయోగించారు. 52kWh నుంచి 76kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉండగా.. SkyNomad N70 Max ఒక్కసారి ఛార్జ్ చేస్తే 505 కిలోమీటర్ల (CLTC) వరకు ఎలక్ట్రిక్ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదే SkyNomad N90 Max 464 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. రెండు మోడళ్లలోనూ డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉండగా, గరిష్టంగా 310kW పవర్ ఉత్పత్తి చేస్తుంది.

క్యాబిన్‌లో Snapdragon 8 Gen 3 ఆధారిత డొమైన్ కంట్రోలర్‌ను అమర్చారు. ఇందులో డ్యూయల్ 5G కనెక్టివిటీ, Wi-Fi 7, ఆరు స్క్రీన్‌ల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 25-స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్, 6.9 అంగుళాల రియర్ కంట్రోల్ డిస్‌ప్లే ఉన్నాయి. అలాగే Hyper XiaoAi వాయిస్ అసిస్టెంట్ ద్వారా కేవలం వాయిస్ కమాండ్‌తోనే క్యాబిన్‌ను 11 రకాల సీటింగ్ మోడ్‌లుగా మార్చుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ SUVలో 700 TOPS Assisted Driving Platform, LiDAR, 4D మిల్లీమీటర్ వేవ్ రాడార్, Xiaomi అభివృద్ధి చేసిన HAD Assisted Driving Systemను అందించారు. భద్రత కోసం స్టీల్-అల్యూమినియం హైబ్రిడ్ బాడీ, 2,200MPa అల్ట్రా హై-స్ట్రెంగ్త్ స్టీల్, 12 ఎయిర్‌బ్యాగ్‌లు, 18-లేయర్ బ్యాటరీ ప్రొటెక్షన్, డ్యూయల్ టెయిల్‌గేట్ రిలీజ్, ట్రిపుల్ రెడండెంట్ డోర్ హ్యాండిల్స్, 26 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సేఫ్టీ ఫీచర్లు అందించారు.

చైనాలో Xiaomi SkyNomad N90 Max ప్రారంభ ధర CNY 299,900 (రూ.42.4 లక్షలు)గా నిర్ణయించారు. SkyNomad N70 Max ధర CNY 259,900 (రూ.36.75 లక్షలు)గా నిర్ణయించారు. ఈ SUVలు మౌంటెన్ గ్రీన్, వ్యాలీ బ్లూ, వోల్కానికి గ్రే ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇంటీరియర్‌లో క్రీమ్ బేజ్, మోచా బ్రౌన్ రంగులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. CNY 1,000 (రూ.14,000) రిఫండబుల్ డిపాజిట్‌తో బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్య ఉత్పత్తి షెడ్యూల్తో పాటు RMB 999 విలువైన ఇన్-కార్ డ్యూయల్ కప్‌హోల్డర్ టేబుల్ను ఉచితంగా అందించనున్నట్లు Xiaomi ప్రకటించింది.