Site icon NTV Telugu

Volkswagen: ఇక “వోక్స్‌వాగన్” వంతు.. జనవరి 1 నుంచి 2 శాతం పెరుగనున్న కార్‌ల ధరలు..

, Volkswagen Taigun

, Volkswagen Taigun

Volkswagen: వచ్చే ఏడాది నుంచి అన్ని కార్ మేకర్ కంపెనీలు తమ కార్ల ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించాయి. టాటా, మారుతి సుజుకీ, హ్యుందాయ్ ఇలా ప్రముఖ కంపెనీలన్నీ కూడా తమ కార్ల ధరల్ని పెంచాలని నిర్ణయించాయి. జనవరి నుంచి కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఇన్‌పుట్, మెటీరియల్ ఖర్చులు పెరుగుతుండటంతో ధరల్ని పెంచుతున్నట్లు వాహన తయారీ కంపెనీలు చెబుతున్నాయి.

జర్మన్ కార్ మేకర్ ఫోక్స్ వ్యాగన్ కూడా ఈ జాబితాలో చేరింది. పెరుగుతున్న ఇన్‌పుట్, మెటీరియల్ ఖర్చుల కారణంగా కార్ల ధరల్ని పెంచుతున్నట్లు వోక్స్‌వాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా వెల్లడించింది. జనవరి1, 2024 నుంచి తమ మోడల్ కార్ల ధరల్ని 2 శాతం పెంచనున్నట్లు తెలిపింది. వోక్స్ వాగన్ నుంచి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో వర్చుస్, టైగున్, టిగువాన్ మోడళ్లు ఉన్నాయి. చాలా వరకు ఇన్‌పుట్ కాస్ట్‌ని బ్రాండ్ భరిస్తున్నప్పటికీ.. కొంత ప్రభావం వినియోగదారుడిపై పడుతుందని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

Read Also: Live-in partner: సెక్స్‌కి నిరాకరించిందని “లివ్ ఇన్ పార్ట్‌నర్” దారుణహత్య..

వోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ. 11.48 లక్షల నుండి రూ. 19.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, వోక్స్‌వ్యాగన్ టైగన్ ధర రూ. 11.62 లక్షల నుండి రూ. 19.76 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఒకే వేరియంట్‌లో వస్తుంది, దీని ధర రూ. 35.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మరోవైపు డిసెంబర్ ఇయర్ ఎండ్ బెనిఫిట్స్ అందిస్తోంది. దీని ద్వారా వోక్స్‌వ్యాగన్ వర్టస్ – రూ. 1.67 లక్షల వరకు, వోక్స్‌వ్యాగన్ టైగన్ – రూ. 1.91 లక్షల వరకు, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ – రూ. 4.20 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

Exit mobile version