NTV Telugu Site icon

Piaggio Vespa: మరింత శక్తివంతంగా వెస్పా GTS 310..

Vespa

Vespa

ఇటాలియన్ టూ-వీలర్ తయారీ స్కూటర్ బ్రాండ్ వెస్పా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ GTS 310ని మిలన్‌లోని EICMA 2024లో ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ను అనేక అద్భుతమైన ఫీచర్లతో తయారు చేశారు. వెస్పా GTS 310 లుక్, డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

లుక్స్-డిజైన్:
వెస్పా GTS 310 ఆల్-స్టీల్ బాడీవర్క్‌ను కలిగి ఉంది. ఇది సెంట్రల్‌గా మౌంటెడ్ ఇంజిన్ యూనిట్, మెకానికల్ భాగాల బరువును భరించే ఛాసిస్‌గా కూడా పనిచేస్తుంది. హ్యాండిల్‌బార్‌లో రెండు క్రోమ్-ప్లేటెడ్ కమాండ్ యూనిట్‌లు ఉన్నాయి. అందులో అన్ని కంట్రోల్ బటన్‌లు ఉంటాయి. ఈ బైక్ మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. GTS, GTS సూపర్, GTS సూపర్‌స్పోర్ట్. ఇక.. కలర్స్ విషయానికొస్తే, స్టాండర్డ్ వెర్షన్ బీజ్ అవోల్జెంటే, నీరో కాన్వింటో, వెర్డే అమాబైల్ వంటి రంగులను కలిగి ఉంది. అలాగే.. ఈ బైకులో ఫుట్‌రెస్ట్‌లపై గ్రిప్స్, రబ్బర్ ఇన్‌సర్ట్‌లు, ఫ్రంట్ సస్పెన్షన్ స్ప్రింగ్‌లు, క్రోమ్ టచ్‌లు ఉన్నాయి. GTS సూపర్‌స్పోర్ట్ గ్రాఫైట్ రంగు రిమ్‌లతో ఆకర్షణీయంగా ఉంది.

ఇంజన్:
లిక్విడ్-కూల్డ్ 278 సిసి ఇంజన్ ఆధారంగా కొత్త పవర్‌ఫుల్ ఇంజన్.. వెస్పా దాని సామర్థ్యాన్ని 310 సిసికి పెంచింది. వెస్పా 310 సిసి ఇంజిన్‌లో 70 శాతం కంటే ఎక్కువ కొత్త కాంపోనెంట్‌లు ఉన్నాయి. సింగిల్-సిలిండర్ స్ట్రోక్ 63 మిమీ నుండి 70 మిమీ కంటే ఎక్కువగా పెరిగింది. ఈ కారణంగా ఇంజన్ 7,750 rpm వద్ద 25 bhp శక్తిని పెంచుతుంది. 6000 ఆర్‌పిఎమ్ వద్ద టార్క్ కూడా 27.5 ఎన్ఎమ్‌లకు పెంచారు. పవర్‌ట్రెయిన్‌లో ఇంజెక్టర్లు, టిల్టెడ్ సిలిండర్, కొత్త స్టార్టింగ్ సిస్టమ్, క్రాంక్‌కేస్ డిజైన్ వంటి ఇతర కొత్త భాగాలు ఉన్నాయి. ఇది మెకానికల్, డ్రైవ్ బెల్ట్ శబ్దాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కొత్త ఇంజిన్ యూరో 5+ ప్రమాణానికి అనుగుణంగా ఉంటుంది.

ఫీచర్లు:
GTS 310 ASR సిస్టమ్ వంటి అనేక ఆధునిక లక్షణాలను కలిగి ఉంది. మెరుగైన సౌలభ్యం కోసం.. వెస్పా సంప్రదాయ ఇగ్నిషన్ స్విచ్ స్థానంలో కీలెస్ ఫోబ్‌ను, సెంటర్ కన్సోల్‌లో బ్యాగ్ హుక్‌తో బ్లాక్ డ్యాష్‌బోర్డ్ సర్ఫేస్‌ను ప్రవేశపెట్టింది. భద్రత పరంగా.. GTS 310 మొత్తం Vespa GTS లైనప్‌లో ప్రామాణిక ఫీచర్‌గా ABS యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.