NTV Telugu Site icon

Ultraviolette SuperStreet: దుమ్మురేపే ఫీచర్లతో సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో 323KM రేంజ్!

Ultra

Ultra

స్పోర్టీలుక్, దుమ్ము రేపే ఫీచర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ బైక్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వాహనదారుల ఎక్స్ పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ బైకులను తీసుకొస్తున్నాయి. తాజాగా ఈవీ లవర్స్ కోసం మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. Ultraviolette తన F77 సూపర్‌స్ట్రీట్‌ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనిలో రెండు రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. F77 సూపర్‌స్ట్రీట్ స్టాండర్డ్ , F77 సూపర్‌స్ట్రీట్ రీకాన్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర రూ. 2.99 లక్షలు. దీని బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా.. డెలివరీలు మార్చి 2025లో ప్రారంభం కానున్నాయి. టర్బో రెడ్, ఆఫ్టర్ బర్నర్, ఎల్లో, స్టెల్లార్ వైట్, కాస్మిక్ బ్లాక్ అనే నాలుగు రకాల రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్ట్రీట్ లోని స్టాండర్డ్ వేరియంట్ లో 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. సింగిల్ ఛార్జ్ తో 211 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. మరో వేరియంట్ అయిన రీకాన్ లో 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్ తో 323 కిలోమీటర్ల వరకూ ప్రయాణించొచ్చు. గంటకు గరిష్టంగా 155 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. స్టాండర్ వేరియంట్ నుంచి 36 బీహెచ్ పీ గరిష్ట శక్తి, 90 ఎన్ ఎం గరిష్ట టార్కు విడుదల అవుతుంది. కేవలం 2.9 సెకన్లలో సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అలాగే 7.8 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. ఇక రీకాన్ వేరియంట్ నుంచి 40 బీహెచ్ పీ, 100 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. అల్ట్రా వయొలెట్ మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది – గ్లైడ్, కంబాట్ మరియు బాలిస్టిక్. డైనమిక్ బ్రేకింగ్‌తో కూడిన 10-స్థాయి రీజెనరేటివ్ బ్రేకింగ్, అధునాతన 3-స్థాయి ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైలెట్ AI F77 సూపర్‌స్ట్రీట్‌తో వచ్చే మొబైల్ అప్లికేషన్ ద్వారా మూవ్‌మెంట్, ఫాల్, టోయింగ్ అలర్ట్‌లు, రిమోట్ లాక్‌డౌన్, క్రాష్ అలర్ట్‌లు, డైలీ రైడ్ గణాంకాలు, యాంటీ-కొల్లిషన్ వార్నింగ్ సిస్టమ్‌ని అందిస్తుంది.