TVS Star City Plus: స్ల్పెండర్‌కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!

  • టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‌కు ముగింపు..
  • 2014లో భారత మార్కెట్‌లోకి వచ్చిన బైక్..
  • హీరో స్ల్పెండర్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచిన బైక్..
  • డిమాండ్ తగ్గడం, అప్‌డేట్స్ లేకపోవడమే డిస్‌కంటిన్యూకు కారణాలు..?
Tvs Star City Plus

Tvs Star City Plus

TVS Star City Plus: ఒకప్పుడు భారత టూవీలర్ మార్కెట్‌లో హీరో స్ల్పెండర్‌‌కు గట్టి పోటీ ఇచ్చిన టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్(TVS Star City Plus) ఇక కనుమరుగు కానుంది. తక్కువ ధర, మంచి మైలేజ్‌, లో మెయింటనెన్స్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకున్న ఈ బైక్‌ను కంపెనీ నిలిపేస్తోంది. టీవీఎస్ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి దీనిని తొలగించింది. 12 ఏళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్‌కు గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. మార్కెట్లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను 2014లో తీసుకువచ్చింది. ఇది కంపెనీ 110సీసీ బైక్ విభాగంలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రారంభంలో కేవలం రూ.44,000 ధరతో బైక్‌ను లాంచ్ చేశారు. ముఖ్యంగా అప్పట్లో 100సీసీ విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న హీరో స్ల్పెండర్‌కు గట్టి పోటీ ఇచ్చింది.

నిలిపివేతకు కారణాలు ఏంటి..?

గత కొనేళ్లుగా ఈ బైక్‌కు డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. దీనికి తోడు చాలా కాలంగా కంపెనీ ఈ బైక్‌ మోడల్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. చివరిసారిగా బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఐదేళ్ల క్రితం చివరిసారిగా అప్‌డేట్ చేశారు. ఇదే కాకుండా టీవీఎస్ తన పోర్ట్‌ఫోలియోలో మరో బైక్ రేడియాన్‌తో స్టార్ సిటీకి ప్లస్‌కు ఫీచర్లు, రూపం దగ్గరగా ఉండటంతో దీనిని డిస్‌కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.