TVS Raider Doctor Doom Edition: TVS మోటార్ కంపెనీ భారత మార్కెట్లో 125cc కమ్యూటర్ బైక్ TVS రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్ (TVS Raider Doctor Doom Edition)ను అధికారికంగా లాంచ్ చేసింది. మార్వెల్ భాగస్వామ్యంలో రూపొందించిన సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (Super Squad Edition) సిరీస్‌లో ఇది కొత్త మోడల్. ఈ ప్రత్యేక ఎడిషన్ రూ.95,320 (ఎక్స్‌షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చింది. రాబోయే వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న TVS డీలర్‌షిప్‌లలో ఈ బైక్ విక్రయానికి అందుబాటులోకి రానుంది.
డిజైన్:
ఈ కొత్త TVS Raider Doctor Doom Editionను Marvelలోని ప్రముఖ విలన్ “డాక్టర్ డూమ్” పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ బైక్‌లో కొత్త స్పెక్ట్రల్ గ్రీన్ (Spectral Green) మల్టీ-టోన్ పెయింట్ స్కీమ్‌ను అందించారు. వెలుతురు, చూసే కోణాన్ని బట్టి ఈ రంగు ఆకుపచ్చ నుంచి గోధుమ రంగులోకి మారినట్లు కనిపించడం దీని ప్రత్యేకత. దీనినే TVS మల్టీ-టోన్ ట్రావెల్ ఫినిష్ గా పిలుస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై డాక్టర్ డూమ్కు సంబంధించిన ప్రత్యేక గ్రాఫిక్స్‌ను అందించారు. బ్లాక్ కలర్ ఎలిమెంట్స్, మెటాలిక్ ఆర్మర్‌ను గుర్తు చేసే డిజైన్ ఈ బైక్‌కు ప్రత్యేకమైన స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి.
మార్వెల్ సూపర్ స్క్వాడ్ సిరీస్:
Doctor Doom Editionతో TVS సూపర్ స్క్వాడ్ లైనప్ మరింత విస్తరించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, డెడ్ పూల్, వుల్వరైన్ థీమ్‌లతో కూడిన రైడర్ 125 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 2023లో ప్రారంభమైన ఈ మార్వెల్ సూపర్ స్క్వాడ్ భారతదేశంలో మొదటి మర్వెల్-థీమ్ మోటార్‌సైకిల్ సిరీస్.
ఇంజిన్:
డిజైన్‌లో మాత్రమే మార్పులు చేసిన TVS, ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో 124.8cc సింగిల్ సిలిండర్, ఎయిర్ & ఆయిల్-కూల్డ్, 3-వాల్వ్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 11.4hp పవర్, 11.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు.
ధర:
TVS రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్ ధర రూ.95,320 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఇది ఇప్పటికే ఉన్న ఇతర Raider 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ వేరియంట్‌ల మాదిరిగానే అదే ధరకు లభిస్తుంది. ఇక సాధారణ TVS రైడర్ 125 మోడల్ ధర రూ.85,887 నుంచి ప్రారంభమవుతుంది.
ఆధునిక ఫీచర్లు:
TVS Raider Doctor Doom Editionలో పలు ఆధునిక ఫీచర్లను అందించారు. అవేంటంటే..
* 124.8cc ఎయిర్ & ఆయిల్-కూల్డ్ ఇంజిన్
* 11.4hp పవర్, 11.7Nm టార్క్
* 5-స్పీడ్ గేర్‌బాక్స్
* iGO Assist టెక్నాలజీ
* Connected రివర్స్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* 85కుపైగా కనెక్టెడ్ ఫీచర్లు
* వెడల్పాటి టైర్లు
* టాప్ వేరియంట్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేకులు
* సింగిల్-చానల్ ABS

