భారీగా పెరిగిన TVS Jupiter ధరలు.. వేరియంట్ లైనప్‌లో తాజా ధరలు ఇక్కడ చెక్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీఎస్ ద్విచక్ర వాహనాల్లో TVS జూపిటర్ 110 ఒకటి. విక్రయాల్లో హోండా యాక్టివా తర్వాత రెండో స్థానంలో ఉన్న ఈ స్కూటర్ ధరలను టీవీఎస్ సంస్థ తాజాగా పెంచింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం కారణంగా ఈ ధరల పెంపు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇంతకుముందు కూడా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, రేడియన్, ఎన్‌టార్క్ 125 మోడళ్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు జూపిటర్ 110 వేరియంట్లపై ధరల పెంపు అమల్లోకి వచ్చింది.
TVS జూపిటర్ 110 – తాజా ధరలు (ఫిబ్రవరి 2026)
– బేస్ డ్రమ్ వేరియంట్ ధర రూ.2,950 పెరిగింది.. కొత్త ధర: రూ.75,600కి చేరగా.. పాత ధర: రూ.72,650గా ఉంది..
– డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.2,385 పెరిగింది.. కొత్త ధర: రూ.77,450కి చే రింది..
– డ్రమ్ SXC (SmartXonnect) వేరియంట్ ధర రూ.2,750 పెరిగింది.. దీంతో.. కొత్త ధర: రూ.84,000కి చేరింది..
– డిస్క్ SXC వేరియంట్ ధర రూ.3,000 పెరిగింది.. దీంతో, కొత్త ధర: రూ.87,750గా ఉంది.. గత ధర: రూ.84,750
– జూపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ ధర రూ.3,250 పెరిగింది.. కొత్త ధర: రూ.88,900కి చేరగా.. గత ధర: రూ.85,650గా ఉంది..
Also Read
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
శాతం పరంగా చూస్తే ధరలు 3.38 శాతం నుంచి 4.06 శాతం వరకు పెరిగాయి. ఇందులో బేస్ వేరియంట్‌కే అత్యధిక శాతం ధర పెరుగుదల నమోదైంది. ఇతర TVS మోడళ్లతో పోలిస్తే భారీ పెంపుగా చెప్పవచ్చు.. ఇతర టీవీఎస్ ద్విచక్ర వాహనాలతో పోలిస్తే జూపిటర్ ధరల పెంపు గణనీయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు TVS ఎన్‌టార్క్ 125 ధర కేవలం రూ.350 మాత్రమే పెరిగింది.. స్టార్ సిటీ ప్లస్, రేడియన్ ధరలు సుమారు రూ.300 పెరిగాయి..
ఇక, మార్కెట్‌లో పోటీగా ఉన్న ఇతర స్కూటర్ల ధరలు.. హోండా యాక్టివా 110 ప్రారంభ ధర: రూ.75,433గా.. DLX వేరియంట్: రూ.85,335, టాప్ స్పెక్ SMART వేరియంట్: రూ.89,806, హీరో ప్లెజర్+ XTEC ప్రారంభ ధర: రూ.69,766, హీరో డెస్టిని 110 ప్రారంభ ధర: రూ.72,000గా ఉన్నాయి..
అయితే, ధరలు పెరిగినా, ఇంజిన్ లేదా ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. జూపిటర్ 110లో 113.3cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, 8 PS పవర్, 9.8 Nm టార్క్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, సస్పెన్షన్ & బ్రేకింగ్.. ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు.. వెనుక భాగంలో 3-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్లు.. రెండు చివర్లలో 12 అంగుళాల వీళ్లు.. డ్రమ్ వేరియంట్లకు 130 mm డ్రమ్ బ్రేక్‌లు.. డిస్క్ వేరియంట్‌కు ముందుభాగంలో 220 mm డిస్క్ బ్రేక్.. SmartXonnect ఫీచర్లు, SXC వేరియంట్లలో.. నావిగేషన్ అసిస్ట్, వాయిస్ అసిస్ట్, ఫైండ్ మై వెహికల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ & మెసేజ్ నోటిఫికేషన్‌లు, మైలేజ్ రీడౌట్, సెగ్మెంట్‌లోనే ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి..
TVS జూపిటర్ 110లో.. ఇన్ఫినిటీ లైట్ బార్, ఫుల్ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాలో మీ హెడ్‌ల్యాంప్, డబుల్ హెల్మెట్ అండర్‌సీట్ స్టోరేజ్, ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, టర్న్ సిగ్నల్ ల్యాంప్ రీసెట్.. వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!