Site icon NTV Telugu

సూపర్ లుక్, బెస్ట్ మైలేజ్, తక్కువ బడ్జెట్‌.. కొంటే TVS Apache RTR 160నే కొనాలి!

Tvs Apache Rtr 160

Tvs Apache Rtr 160

Best 160cc Bike is TVS Apache RTR 160 in India: తక్కువ బడ్జెట్‌లో సూపర్ లుక్, బెస్ట్ మైలేజ్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా?.. అలా అయితే ‘టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160’ (TVS Apache RTR 160) మీకు సరైన ఎంపిక అని చెప్పొచ్చు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 2025 వెర్షన్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160ని గత జూన్ మాసంలో విడుదల చేసింది. శైలి, ఆధునిక లక్షణాలు, నమ్మకమైన పనితీరుతో భారతీయ యువతలో ఈ బైక్ ప్రజాదరణ పొందుతోంది. ఈ బైక్ ఇప్పటికీ లక్షలాది మందిని ఎందుకు ఆకర్షిస్తుందో తెలుసుకుందాం.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 డిజైన్ మొదటి చూపులోనే అందరిని ఆకర్షిస్తుంది. ముందు భాగంలో ఉన్న ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు బైక్‌కు మరింత ఆకర్షణ. ఇంధన ట్యాంక్‌పై ఎంబోస్ చేయబడిన రేసింగ్ గ్రాఫిక్స్ స్పోర్టీ లుక్ ఇస్తుంది. ఏరోడైనమిక్ బాడీ అధిక వేగంతో అద్భుతమైన బ్యాలెన్స్‌ను అందిస్తుంది. రైడర్‌కు మెరుగైన నియంత్రణ, భద్రతను అందిస్తుంది. 159.7సీసీ ఇంజిన్ BS-VI కంప్లైంట్, రేస్-ట్యూన్డ్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 15 హెచ్‌పీ పవర్‌ను, 13.85 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 160సీసీ విభాగంలో అగ్రశ్రేణి ఎంపికలలో ఒకటిగా నిలిచింది.

Also Read: IND vs SA: టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్‌.. మరి బుమ్రా సంగతేంటి?

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 బైక్ దాదాపు 5.3 సెకన్లలో 0-60 కిమీ/గం స్పీడ్ అందుకుంటుంది. ట్రాఫిక్‌లో లేదా హైవేలో ఇది సహాయపడుతుంది. ఇందులో 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. లాంగ్ రైడ్స్‌లో కూడా మెరుగైన ఇంజిన్ పనితీరును అందిస్తుంది. లీటరుకు దాదాపు 49 కి.మీ మైలేజ్ అందిస్తుంది. స్పోర్టీ బైక్ విభాగంలో ఈ మైలేజ్ రావడం చాలా అరుదు. ఇది 12 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంకర్‌ కలిగి ఉంది. ఈ బైక్ కేవలం లుక్స్ మాత్రమే కాదు.. హై-టెక్ టెక్నాలజీ కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ సిస్టమ్ డిజిటల్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. రైడర్ స్టీరింగ్ కౌంటర్, డాష్‌బోర్డ్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్‌లను చూడగలం.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 భద్రత విషయంలో ఎటువంటి రాజీ అవసరం లేదు. ఇది సింగిల్-ఛానల్ ABSని కలిగి ఉంది. టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌, వెనుకవైపు డ్యూయల్‌ షాక్‌ అబ్జార్బర్స్‌తో వస్తోంది. ఈ బైక్ ధర భారత మార్కెట్లో రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఫీచర్లు, లుక్స్, మైలేజ్ 160cc విభాగంలో అత్యంత సరసమైన స్పోర్ట్స్ బైక్‌లలో ఒకటిగా నిలిపాయి.

Exit mobile version