Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
- టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV
- 543KM రేంజ్
- ఈ ఎలక్ట్రిక్ SUV టాప్-స్పెక్ E3 వేరియంట్ ధర రూ.23.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toyota Kirloskar Motor భారత మార్కెట్లో తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ SUV అయిన Toyota Urban Cruiser EV ను విడుదల చేసింది. “అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV” పేరుతో వచ్చిన ఈ మోడల్ మధ్యతరహా ఎలక్ట్రిక్ SUV విభాగంలో కంపెనీకి కొత్త గుర్తింపును తీసుకురానుంది. ఈ ఎలక్ట్రిక్ SUV టాప్-స్పెక్ E3 వేరియంట్ ధర రూ.23.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది Maruti Suzuki రూపొందించిన ఇ-విటారా ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేశారు.
ఆకట్టుకునే ఎక్స్టీరియర్ డిజైన్
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పరిమాణ పరంగా ఇ-విటారాను పోలి ఉన్నప్పటికీ, టయోటా ప్రత్యేక డిజైన్ టచ్‌ను కలిగి ఉంది. ముందుభాగంలో స్టైలిష్ గ్రిల్, చెక్కినట్లుగా కనిపించే హుడ్, సైడ్ క్యారెక్టర్ లైన్స్ ఈ SUVకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఈ SUV వీల్‌బేస్ 2700mm కాగా, పొడవు 4,285mm, వెడల్పు 1,800mm, ఎత్తు సుమారు 1,640mmగా ఉంది.
ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్
ఈ ఎలక్ట్రిక్ SUV కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ వంటి మోనోటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే, కేఫ్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ డ్యూయల్-టోన్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డ్యూయల్-టోన్ మోడళ్లలో బ్లాక్ కలర్ రూఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రీమియం క్యాబిన్, ఆధునిక ఫీచర్లు
క్యాబిన్లో బ్లాక్-బ్రౌన్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను అందించారు. డాష్‌బోర్డ్ డిజైన్ Maruti e Vitara ను పోలి ఉంటుంది. ఈ SUVలో పానోరమిక్ సన్‌రూఫ్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, JBL సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, డయల్-టైప్ గేర్ షిఫ్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
భద్రతకు పెద్దపీట
భద్రత పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ SUVలో అనేక ఆధునిక ఫీచర్లను అందించారు. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి సేఫ్టీ టెక్నాలజీలు ఉన్నాయి. టాప్-ఎండ్ E3 వేరియంట్లో 61kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ ఎలక్ట్రిక్ SUV 171hp పవర్, 193Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ కారు సుమారు 543 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!