Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు

  • టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV
  • 543KM రేంజ్
  • ఈ ఎలక్ట్రిక్ SUV టాప్-స్పెక్ E3 వేరియంట్ ధర రూ.23.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Toyota Urban Cruiser Ev

Toyota Urban Cruiser Ev

Toyota Kirloskar Motor భారత మార్కెట్లో తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ SUV అయిన Toyota Urban Cruiser EV ను విడుదల చేసింది. “అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV” పేరుతో వచ్చిన ఈ మోడల్ మధ్యతరహా ఎలక్ట్రిక్ SUV విభాగంలో కంపెనీకి కొత్త గుర్తింపును తీసుకురానుంది. ఈ ఎలక్ట్రిక్ SUV టాప్-స్పెక్ E3 వేరియంట్ ధర రూ.23.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది Maruti Suzuki రూపొందించిన ఇ-విటారా ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేశారు.

ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్ డిజైన్

×
×
Ad

అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పరిమాణ పరంగా ఇ-విటారాను పోలి ఉన్నప్పటికీ, టయోటా ప్రత్యేక డిజైన్ టచ్‌ను కలిగి ఉంది. ముందుభాగంలో స్టైలిష్ గ్రిల్, చెక్కినట్లుగా కనిపించే హుడ్, సైడ్ క్యారెక్టర్ లైన్స్ ఈ SUVకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఈ SUV వీల్‌బేస్ 2700mm కాగా, పొడవు 4,285mm, వెడల్పు 1,800mm, ఎత్తు సుమారు 1,640mmగా ఉంది.

ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్

ఈ ఎలక్ట్రిక్ SUV కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ వంటి మోనోటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే, కేఫ్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ డ్యూయల్-టోన్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డ్యూయల్-టోన్ మోడళ్లలో బ్లాక్ కలర్ రూఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ప్రీమియం క్యాబిన్, ఆధునిక ఫీచర్లు

క్యాబిన్‌లో బ్లాక్-బ్రౌన్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను అందించారు. డాష్‌బోర్డ్ డిజైన్ Maruti e Vitara ను పోలి ఉంటుంది. ఈ SUVలో పానోరమిక్ సన్‌రూఫ్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, JBL సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, డయల్-టైప్ గేర్ షిఫ్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

భద్రతకు పెద్దపీట

భద్రత పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ SUVలో అనేక ఆధునిక ఫీచర్లను అందించారు. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి సేఫ్టీ టెక్నాలజీలు ఉన్నాయి. టాప్-ఎండ్ E3 వేరియంట్‌లో 61kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ ఎలక్ట్రిక్ SUV 171hp పవర్, 193Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ కారు సుమారు 543 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.