Site icon NTV Telugu

ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.. త్వరలో Toyota GR Yaris Morizo RR ఎంట్రీ

Tayota

Tayota

Toyota GR Yaris Morizo RR: టయోటా తన ప్రతిష్టాత్మక హ్యాచ్‌బ్యాక్‌లో మరింత స్పెషల్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. టోక్యో ఆటో సలోన్ 2026 వేదికగా Toyota GR Yaris Morizo RRను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే ప్రసిద్ధి చెందిన GR యారిస్‌కు మరింత శక్తివంతమైన, ట్రాక్-ఫోకస్డ్ లిమిటెడ్ ఎడిషన్‌గా రూపొందింది. కాగా, ఈ కారులోని “మొరిజో” పేరు ఎంతో ప్రత్యేకం.. ఇది టయోటా మోటార్ కార్పొరేషన్ ఛైర్మన్ అకియో టయోడాకి ఉన్న రేసింగ్ పేరు.. అకియో టయోడా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాకుండా, స్వయంగా రేసింగ్‌లో పాల్గొంటాడు. ఆయన 2025 న్యూర్బర్గ్‌రింగ్ 24 గంటల ఎండ్యూరెన్స్ రేస్‌లో కూడా “మొరిజో” పేరుతో పాల్గొన్నారు. ఆ రేసింగ్ అనుభవం నుంచే ఈ GR Yaris Morizo RR రూపుదిద్దుకుంది.

Read Also: Bihar: జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగికి షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ

అయితే, టయోటా ఈ స్పెషల్ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ కారును సాధారణంగా షోరూమ్‌కి వెళ్లి కొనుగోలు చేయలేరు. లాటరీ విధానం ద్వారా కొనుగోలుదారులను ఎంపిక చేస్తుంది టయోటా. డెలివరీలు 2026 వేసవికాలం నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా, అమెరికా లాంటి మార్కెట్లలో ఈ మోడల్ విక్రయాలు ఉండవని టయోటా స్పష్టం చేసింది.

కేవలం 200 కార్లే
* జపాన్‌లో – 100 యూనిట్లు
* ఎంపిక చేసిన యూరప్ మార్కెట్లకు – 100 యూనిట్లు

డిజైన్ మార్పులు
* స్టాండర్డ్ GR యారిస్‌తో పోలిస్తే, మొరిజో RRలో అనేక విజువల్, ఏరోడైనమిక్ అప్‌గ్రేడ్స్..
* రేస్ డేటాతో రూపొందించిన కార్బన్ ఫైబర్ రియర్ వింగ్
* కొత్త ఫ్రంట్ స్ప్లిట్టర్
* రివైజ్డ్ సైడ్ స్కర్ట్స్
* కార్బన్ ఫైబర్ బానెట్
* ఈ కారు “గ్రావెల్ ఖాకీ” అనే ఒక్క ఎక్స్‌క్లూజివ్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.
* మ్యాట్ బ్రాంజ్ అల్లాయ్ వీల్స్
* పసుపు రంగు బ్రేక్ కాలిపర్స్
* సంతకం ఉన్న విండ్షీల్డ్
* కేబిన్‌లో నంబర్డ్ ప్లాక్.. ఈ ఫీచర్లు దీని లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి.

Read Also: Telangana Drugs Alert: ప్రజలకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ హెచ్చరిక.. ఈ పిల్లల సిరప్ వాడొద్దు!

సస్పెన్షన్, డ్రైవ్ మోడ్‌లలో మార్పులు
* రేస్ ట్రాక్‌లపై మెరుగైన స్థిరత్వం కోసం టయోటా సస్పెన్షన్‌ను పూర్తిగా రీట్యూన్ చేసింది. ముఖ్యంగా న్యూర్బర్గ్‌రింగ్ లాంటి కఠినమైన ట్రాక్‌లను దృష్టిలో ఉంచుకొని సెటప్ చేశారు. అలాగే, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌ను కూడా సర్క్యూట్ టెస్టింగ్ తర్వాత మళ్లీ కేలిబ్రేట్ చేశారు. ఇక, AWD సిస్టమ్‌లో మార్పులు చేశారు. స్టాండర్డ్ Gravel Mode తొలగించి, దాని స్థానంలో కొత్త Morizo Drive Modeను జోడించారు. ఈ మోడ్‌లో ముందు- వెనుక చక్రాలకు 50:50 నిష్పత్తిలో శక్తి పంపిణీ అవుతుంది.

ఇంజిన్ పనితీరు
* 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్
* 8-స్పీడ్ Gazoo Racing ఆటోమేటిక్ గేర్‌బాక్స్
* పవర్ ఫిగర్స్‌
* ఈ ఇంజిన్ Lexus LBX Morizo RRలో ఉపయోగించిన యూనిట్‌కు దగ్గరగా ఉంటుంది.

రేస్-రెడీ ఇంటీరియర్
* కేబిన్ పూర్తిగా మోటార్‌స్పోర్ట్స్ ఫీలింగ్ ఇచ్చేలా డిజైన్
* చిన్న సైజ్ Alcantara ర్యాప్‌డ్ స్టీరింగ్ వీల్
* పసుపు యాక్సెంట్స్ & స్టిచింగ్
* మోటార్‌స్పోర్ట్ స్టైల్ స్విచ్‌లు
* డెడికేటెడ్ ‘Morizo Mode’ చూపించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. మొత్తంగా, GR Yaris Morizo RR టయోటా తయారు చేసిన అత్యంత డ్రైవర్-సెంట్రిక్, రేసింగ్ తో నిండిన లిమిటెడ్ ఎడిషన్ కారుగా నిలవనుంది.

Exit mobile version