Site icon NTV Telugu

స్పోర్టీ లుక్, ప్రీమియం ఫీచర్స్ తో Toyota Fortuner Leader Edition లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

Toyota Fortuner Leader Edition

Toyota Fortuner Leader Edition

Toyota Fortuner Leader Edition: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ 2025 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ (Fortuner Leader Edition) ను భారత్‌లో విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ SUV స్పోర్టీ లుక్, ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ SUV 2.8 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 201 bhp శక్తి, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్‌ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్‌గా లభిస్తుంది. ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ 4×2 RWD కాన్ఫిగరేషన్‌లో 7 మంది ప్రయాణీకులకు సీటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

ICC Rankings 2025: దుమ్మురేపిన మహ్మద్ సిరాజ్.. అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు!

కారు ఎక్స్‌టీరియర్‌లో ఈ ఎడిషన్ బోల్డ్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ యాక్సెంట్స్‌తో రీడిజైన్ చేయబడింది. ఫ్రంట్, రియర్ బంపర్ స్పాయిలర్‌లు, డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ ఇంకా గ్లోస్సీ బ్లాక్ అల్లాయ్ వీల్స్ SUVకి స్పోర్టీ ఫీల్ ఇస్తాయి. ప్రత్యేకంగా సిగ్నేచర్ హుడ్ ఎంబ్లెం కూడా ఈ ఎడిషన్‌కు ప్రత్యేకతను అందించనుంది. ఇంటీరియర్‌లో కూడా ప్రీమియం అనుభూతి ఉంది. బ్లాక్, మెరూన్ డ్యూయల్ టోన్ సీట్లు, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్‌లు, ఆటోమేటిక్ ముడుచుకునే ORVMలు, వెనుక ప్రయాణీకుల కోసం రియర్ ఏసీ వెంట్లు, అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ SUV 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది.

స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్‌ ఫీచర్స్ తో Jeep Compass Track Edition లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా.!

ఇక కారు భద్రతా ఫీచర్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HAC) ఉన్నాయి. ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ కస్టమర్లకు ఆటిట్యూడ్ బ్లాక్, సూపర్ వైట్, పెరల్ వైట్, సిల్వర్ వంటి వివిధ రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. మొత్తం మీద, ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ SUV స్పోర్టీ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అధునాతన భద్రతా వ్యవస్థలతో ప్రీమియం SUV మార్కెట్లో కొత్త ఆకర్షణగా నిలవనుంది. ఇక ధరల విషయానికి వస్తే.. మాన్యువల్ వేరియంట్ రూ.34.79 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ రూ.36.92 లక్షలకు లభిస్తుంది. పెర్ల్ వైట్ పేయింట్ ఆప్షన్ ఎంచుకుంటే ధరలు మరింత స్వల్పంగా పెరుగుతాయి.

Exit mobile version