Site icon NTV Telugu

Top 5 Upcoming SUVs in India 2026: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారత్‌లో రాబోయే టాప్ 5 SUVలు ఇవే..

Suvs

Suvs

Top 5 Upcoming SUVs in India 2026: భారత కార్ మార్కెట్‌లో త్వరలో కొత్త మోడళ్లు రాబోతున్నాయి. వీటిలో ఎక్కువగా ఎస్‌యూవీ విభాగానికి చెందిన వాహనాలే ఉండటం విశేషం. కొన్ని మోడళ్లు కొత్తగా, మరికొన్ని ఇప్పటికే ఉన్న మోడళ్లకు అప్డేటెడ్ వెర్షన్లుగా రానున్నాయి. రాబోయే టాప్ 5 ఎస్‌యూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Mahindra XUV 7XO..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో(Mahindra XUV 7XO) అనేది ఎక్స్‌యూవీ700కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా జనవరి 5, 2026న విడుదల కానుంది. ఇది కొత్త డిజైన్ తో వస్తుంది. ఇన్వర్టెడ్ ఎల్ ఆకారంలో డీఆర్‌ఎల్‌లతో డ్యూయల్ పాడ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ కలర్ గ్రిల్, కొత్త టెయిల్ లైట్లు, మూడు స్క్రీన్‌లతో క్యాబిన్ ఉండనున్నాయి. ఇంజిన్ పరంగా ఇప్పటివరకు ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఆప్షన్లు రానున్నాయి. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉంటాయి. ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్ కూడా రావచ్చు.

Nissan Tekton
నిస్సాన్ టెక్టాన్(Nissan Tekton) ఎస్‌యూవీ 2026 ప్రారంభంలో విడుదల కానుంది. దీన్ని కొత్త రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ఈ కారు హ్యుందాయ్ క్రెటాకు పోటీగా నిలవనుంది. పట్రోల్ కార్ నుంచి ప్రేరణ పొందిన ఎల్‌ఈడి లైట్లు, క్రోమ్ డిజైన్ అంశాలు ఇందులో కనిపిస్తాయి. లాంచ్ సమయం దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

New Gen Kia Seltos
కొత్త తరం కియా సెల్టోస్ ఇప్పటికే ఆవిష్కరించారు. ఇందులో కొత్త స్టైలింగ్, కొంచెం పెద్ద సైజు, కొత్త ఇంటీరియర్స్ ఉన్నాయి. రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉంటాయి. ధరలు జనవరి 2, 2026న ప్రకటిస్తారు. ప్రారంభ ధర సుమారు 12 లక్షల రూపాయలుగా ఉండొచ్చని అంచనా.

New Renault Duster
రెనాల్ట్ డస్టర్ కొత్త తరం మోడల్ 2026 ప్రారంభంలో భారత్‌కు రానుంది. ఇది కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. బలమైన డిజైన్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వేరియంట్లు, ఆఫ్‌రోడ్ సామర్థ్యం దీని ప్రత్యేకతలు. ఇప్పటికే విదేశీ మార్కెట్లలో అమ్మకాల్లో ఉంది. భారత్‌లో 15 లక్షల రూపాయల లోపు ధరలో రావచ్చని భావిస్తున్నారు. అడ్వెంచర్ ఎస్‌యూవీ అభిమానులను మళ్లీ ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కారు రూపొందించారు.

Maruti Suzuki eVitara
మారుతి సుజుకి ఈ-విటారా భారత మార్కెట్‌లో కంపెనీ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రానుంది. ఇప్పటికే దీన్ని ఆవిష్కరించారు. ఇది 49 కిలోవాట్ అవర్, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. రెండూ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌లో ఉంటాయి. పెద్ద బ్యాటరీతో 543 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ-విటారా మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ డెల్టాలో 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది.

 

 

 

Exit mobile version