Top Selling Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడబోతున్న కార్ల లిస్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన హ్యుందాయ్ క్రెటా తాజాగా రెండవ స్థానానికి పడిపోయింది. దీనికి కారణం మారుతి సుజుకీ డిజైర్ అమ్మకాల ప్రభంజనం. జూలై 2025లో మారుతి సుజుకీ డిజైర్ మొత్తం 20,895 యూనిట్లను విక్రయించి అగ్రస్థానాన్ని అందుకుంది. ఇది సెడాన్ కార్ల పట్ల ఉన్న నమ్మకాన్ని, వినియోగదారుల మళ్లీ ఆ కారు వైపు చూస్తున్న పరిస్థితిని కనపడుతోంది. ఇకపోతే, చాలాకాలంగా టాప్‌లో కొనసాగుతున్న హ్యుందాయ్ క్రెటా జూలైలో 16,898 యూనిట్లు అమ్ముడబోయి రెండవ స్థానంలో నిలిచింది. SUV సెగ్మెంట్‌లో ఇంకా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, సెడాన్ మోడల్స్ పట్ల తిరిగి ఆసక్తి పెరిగినట్లు ఈ విషయాలను బట్టి అర్థమవుతుంది.
Gold Price Today: షాకింగ్.. వరుసగా నాలుగో రోజు! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే
ఇక ఈ లిస్ట్ లో మూడవ స్థానాన్ని మారుతి సుజుకీ ఎర్టిగా కైవసం చేసుకుంది. 16,604 యూనిట్ల అమ్మకాలతో ఈ 7-సీటర్ MPV కుటుంబాలకే కాకుండా, కార్పొరేట్ వినియోగదారులకు కూడా మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇక లిస్టులో మారుతి వెగనార్ 14,710 యూనిట్లు, మారుతి స్విఫ్ట్ 14,200 యూనిట్ల అమ్మకాలతో నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.
వీటి తర్వాత మారుతి బ్రెజ్జా 14,100 యూనిట్లు, మహీంద్రా స్కార్పియో 13,800 యూనిట్లు, మారుతి ఫ్రాంక్స్ 12,900 యూనిట్లు, టాటా నెక్సాన్ 12,855 యూనిట్లు, మారుతి బాలెనో 12,600 యూనిట్లతో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నాయి. ఇకపోతే, ఈ జాబితాలో టాప్ 10లో 7 కార్లు మారుతి సుజుకీకి చెందినవే కావడం గమనార్హం. డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, వాగన్ ఆర్, బ్రెజ్జా, ఫ్రాంక్స్, బాలెనో అన్నీ వేర్వేరు సెగ్మెంట్లలో ఉండడంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించగలిగాయి.
