Elon Musk Tesla Roadster: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలన టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశారు. టెక్సాస్‌లో నిర్వహించిన ప్రొడక్ట్ డెమోలో టెస్లా రోడ్ స్టర్ (Tesla Roadster) స్పోర్ట్స్ కారును ఉపయోగించారు. ఈ కారు కేవలం వేగంగా దూసుకెళ్లడమే కాకుండా.. గాల్లోకి ఎగిరి, జంప్‌లు చేయగలదని మస్క్ నిరూపించారు.
రోడ్‌స్టర్ 0 నుంచి 60 mph (సుమారు 97 కి.మీ.) వేగాన్ని కేవలం ఒక సెకనులోపే అందుకోగలదని మస్క్ తెలిపారు. డెమోలో కారు ప్రత్యేక ర్యాంప్‌పైకి ఎక్కి, తలకిందులుగా వేలాడిన తర్వాత గాల్లో తిరుగుతూ కిందకు ల్యాండ్ అయింది. ఆ తర్వాత టెస్లా కార్ల వరుసగా ఉండగా వాటి ఫై నుండి కూడా జంప్ చేసింది. అయితే ఈ ప్రదర్శన సమయంలో కారులో డ్రైవర్ ఎవరూ లేరు. భద్రత కారణంగానే డ్రైవర్ లేకుండా డెమో నిర్వహించినట్లు మస్క్ తెలిపారు.
రోడ్‌స్టర్‌లో మొత్తం 10 నాజిల్స్, అత్యధిక పీడనంతో కూడిన ఎయిర్ ట్యాంకులను ఉపయోగించినట్లు మస్క్ వెల్లడించారు. ఇవి గాల్లోకి ఎగరడానికి మాత్రమే కాకుండా.. నేలపై కారు వేగంగా దూసుకెళ్లేందుకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ టెక్నాలజీ టెస్లా ఆటోమోటివ్ నైపుణ్యాలు, స్పేస్ఎక్స్ రాకెట్ టెక్నాలజీ కలయిక ఫలితమని మస్క్ చెప్పుకొచ్చారు.
ఈ రోడ్‌స్టర్‌ను 2028లో ఉత్పత్తిలోకి తీసుకురావాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే టెస్లా గతంలో ప్రకటించిన పలు ఉత్పత్తులు, టెక్నాలజీల విషయంలో గడువులు ఆలస్యమైన సందర్భాలు ఉన్నందున.. ఈ టైమ్‌లైన్‌పై స్పష్టత రావాల్సి ఉంది. డెమోలో కారు గాల్లోకి ఎగిరినప్పటికీ.. ఇది నిజమైన ఫ్లయింగ్ కారుగా మారుతుందా.? అనేది ఇంకా నిరూపించాల్సి ఉంది. ముఖ్యంగా ఎక్కువ దూరం నిరంతరంగా ఎగరగల సామర్థ్యాన్ని టెస్లా ప్రదర్శించలేదు.
విమానాలు తక్కువ బరువుతో ఉండేలా రూపొందిస్తారు. కానీ రోడ్లపై నడిచే కార్లకు బంపర్లు, క్రంపుల్ జోన్లు వంటి అదనపు నిర్మాణాలు అవసరం. అందువల్ల ఒకే వాహనంలో కారు, విమానం లక్షణాలను సమర్థవంతంగా కలపడం చాలా కష్టమని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రస్తుత డెమోను పూర్తిస్థాయి ఫ్లయింగ్గా కాకుండా ‘హాప్’ లేదా స్వల్ప దూరం గాల్లోకి ఎగరడంగా చూడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Turns out the future does have flying cars https://t.co/6fexPp6SXI
— Elon Musk (@elonmusk) October 16, 2026

