Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు

  • టాటా టిగోర్‌కు త్వరలో ఫేస్‌లిఫ్ట్
  • టియాగో తరహాలో కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్
  • కొత్త హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్
  • 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ వచ్చే అవకాశం
Tata Tigor

Tata Tigor

Tata Tigor Facelift: టాటా మోటార్స్ నుంచి మరో ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. ఇప్పటికే పంచ్, టియాగో ఫేస్‌లిఫ్టులను తీసుకువచ్చిన టాటా, ఇప్పుడు తన సెడాన్ సెగ్మెంట్‌లో కీలకంగా ఉన్న టిగోర్‌కు కొత్త రూపాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కొత్త టిగోర్‌ ఫ్రంట్ భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేసే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, హెడ్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ వంటి మార్పులు ఉండనున్నాయి. కొత్త టెయిల్ ల్యాంప్స్, కనెక్టెడ్ లైట్ బార్ తరహా డిజైన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న టిగోర్‌తో పోలిస్తే కొత్త టిగోర్ మరింత ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇంటీరియల్‌లో కూడా చాలా మార్పులు చేస్తోంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డ్యాష్‌బోర్డ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

ఇక టిగోర్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుత 1.2లీటర్, 3-సిలిండర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది సుమారు 84-85 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగవచ్చని అంచనా. CNG వెర్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.

ICE ఇంజన్‌తో పాటు టిగోర్ EV ఫేస్‌లిఫ్ట్‌ను కూడా తీసుకువస్తోంది. ప్రస్తుతం టిగోర్ EVలో 26 kWh బ్యాటరీ, 75 hp మోటార్, 170 Nm టార్క్, 315 కిలోమీటర్ల ARAI క్లెయిమ్డ్ రేంజ్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో బ్యాటరీ సామర్థ్యం, డిజైన్, EV-స్పెసిఫిక్ ఫీచర్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.20226లోనే మార్కెట్‌లోకి టిగోర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై టాటా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.