Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
- టాటా టిగోర్‌కు త్వరలో ఫేస్‌లిఫ్ట్
- టియాగో తరహాలో కొత్త ఎక్స్టీరియర్ డిజైన్
- కొత్త హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్
- 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Tigor Facelift: టాటా మోటార్స్ నుంచి మరో ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. ఇప్పటికే పంచ్, టియాగో ఫేస్లిఫ్టులను తీసుకువచ్చిన టాటా, ఇప్పుడు తన సెడాన్ సెగ్మెంట్లో కీలకంగా ఉన్న టిగోర్‌కు కొత్త రూపాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కొత్త టిగోర్ ఫ్రంట్ భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేసే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, హెడ్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ వంటి మార్పులు ఉండనున్నాయి. కొత్త టెయిల్ ల్యాంప్స్, కనెక్టెడ్ లైట్ బార్ తరహా డిజైన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న టిగోర్‌తో పోలిస్తే కొత్త టిగోర్ మరింత ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇంటీరియల్లో కూడా చాలా మార్పులు చేస్తోంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొత్త డ్యాష్‌బోర్డ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.
ఇక టిగోర్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుత 1.2లీటర్, 3-సిలిండర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది సుమారు 84-85 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు కొనసాగవచ్చని అంచనా. CNG వెర్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.
Also Read
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ICE ఇంజన్‌తో పాటు టిగోర్ EV ఫేస్‌లిఫ్ట్‌ను కూడా తీసుకువస్తోంది. ప్రస్తుతం టిగోర్ EVలో 26 kWh బ్యాటరీ, 75 hp మోటార్, 170 Nm టార్క్, 315 కిలోమీటర్ల ARAI క్లెయిమ్డ్ రేంజ్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో బ్యాటరీ సామర్థ్యం, డిజైన్, EV-స్పెసిఫిక్ ఫీచర్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.20226లోనే మార్కెట్లోకి టిగోర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై టాటా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?