Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న SUV

  • జూన్ 30న రాబోతున్న టాటా సియోర్రా ఈవీ..
  • టాటా నుంచి వస్తున్న 7వ ఎలక్ట్రిక్ కారు..
  • స్టైలిష్ డిజైన్, బిగ్ బ్యాటరీ ప్యాక్స్..
  • ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ రేంజ్..
Tata Sierra Ev

Tata Sierra Ev

Tata Sierra EV: టాటా మోటార్స్(Tata Motors) ఎంతో ప్రతిష్టాత్మకం భావిస్తున్న, కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూసస్తున్న ఎలక్ట్రిక్ SUV సియోర్రా EV(Sierra EV) రాబోతోంది. జూన్ 30న ఈ కార్‌ను లాంచ్ కాబోతోంది. దేశవ్యాప్తంగా ఈవీ కార్‌లలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 7వ ఎలక్ట్రిక్‌ కారుగా సియెర్రా ఉండబోతోంది. టాటా ఈవీ లైనప్‌లో కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మధ్యలో సియెర్రా ఈవీ ఉండబోతోంది. ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, లెటెస్ట్ టెక్నాలజీతో ఈ కార్ వస్తోంది.

పెద్ద బ్యాటరీ ఆప్షన్స్, 500 కి.మీ రేంజ్:

సియోర్రా ఈవీ ఒకటి కన్నా ఎక్కువ బ్యాటరీ ప్యాక్స్‌ను ఆఫర్ చేస్తోంది. హారియర్ ఈవీలో ఉపయోగించిన టెక్నాలజీ ఆధారంగా 65kWh, 75kWh వరకు బ్యాటరీ ప్యాక్స్ ఉండే అవకాశం ఉంది. ఈ కార్ రియర్ వీల్ డ్రైవ్(RWD)తో పాటు రెండు మోటార్ల సెటప్‌తో ఆల్-వీల్ డ్రైవ్(AWD)తో రాబోతోంది. పెద్ద బ్యాటరీతో వస్తుండటంతో ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వరకు రేంజ్ వస్తుందని అంచనా. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు వెహికిల్-టూ-లోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది.

×
×
Ad

డిజైన్ అండ్ టెక్నాలజీ:

సియోర్రా ఈవీ డిజైన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఐసీఈ(డిజిల్-పెట్రోల్) మోడల్స్‌ను పోలి ఉంటుంది. అయితే, కొన్ని మార్పులు మాత్రం కనిపిస్తాయి. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్ డిజూన్, ఈవీ స్టైలింగ్ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఫుల్ విడ్త్ ఎల్‌ఈడీ లైటింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరోడైనమిక అల్లాయ్ వీల్స్ వంటివి ఉంటాయి.

ఇక ఇంటరీయర్ ఫీచర్ల విషయానికి వస్తే 3- స్క్రీన్ సెటప్ ఉండే అవకాశం ఉంది. డిజిటర్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్ ఉంటుంది. పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియ ఆడియో సిస్టమ్, అంబియంట్ లైంటిగ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. భద్రత విషయంలో ADAS, 360 డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే సదుపాయాలు టాప్ వేరియంట్లలో ఉండొచ్చు.

ధర:

టాటా సియెర్రా మార్కెట్‌లో ఉన్న మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్సర్, మారుతి ఈ విటారా, టాయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాలకు పోటీ ఇస్తుంది. ప్రారంభ ధర రూ. 18 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ ధర రూ 25 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.