627 కిలోమీటర్ల రేంజ్.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Safari EV Launch Soon: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ముందంజలో ఉన్న టాటా మోటార్స్ మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. 7 సీటర్ సెగ్మెంట్లో కొత్త ఎలక్ట్రిక్ SUVగా టాటా సఫారీ EVని త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. 600 కిలోమీటర్లకు పైగా రేంజ్‌తో రానున్న ఈ వాహనం ఇప్పటికే ఆటోమొబైల్ మార్కెట్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నివేదికల ప్రకారం, టాటా సఫారీ EVను ఈ ఏడాది పండుగ సీజన్లో, ముఖ్యంగా దీపావళి సమయానికి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వాహనం ఉత్పత్తి 2026 ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. టాటా హారియర్ EV ఆధారంగా రూపొందుతున్న ఈ మోడల్, కంపెనీకి తొలి మూడు వరుసల (7-సీటర్) ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి..?
డిజైన్ పరంగా చూస్తే, సఫారీ EV హారియర్ EV స్టైలింగ్‌ను అనుసరించే అవకాశం ఉంది. అయితే, పరిమాణంలో పెద్దదిగా ఉండే ఈ SUV మరింత ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ప్రస్తుతం హారియర్ EV కంపెనీ ఫ్లాగ్‌షిప్‌గా ఉండగా, విడుదల అనంతరం ఆ స్థానాన్ని సఫారీ EV దక్కించుకునే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ వాహనం 65kWh లేదా 75kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులోకి రావొచ్చు. రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్లో సింగిల్ మోటార్ సెటప్ ఉండగా, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లో డ్యూయల్ మోటార్ సెటప్ ఉండే అవకాశముంది.
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ఏ వేరియంట్.. ఎంత రేంజ్..?
రేంజ్ పరంగా ఇది మరింత ఆకట్టుకునేలా ఉంది. 75kWh బ్యాటరీతో రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ సుమారు 627 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని అందించవచ్చు. అదే AWD వేరియంట్లో ఈ రేంజ్ సుమారు 622 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. 65kWh బ్యాటరీ వేరియంట్ సుమారు 538 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని అంచనా. అదనంగా, టాటా సఫారీ EVలో 100kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశముంది. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకునే సౌలభ్యం లభిస్తుంది. మహీంద్రా XEV 9S, విన్‌ఫాస్ట్ VF 7 వంటి మోడళ్లకు పోటీగా రానున్న టాటా సఫారీ EV, భారతీయ మార్కెట్లో 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?