రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!

  • రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో Nexon Camo Edition లాంచ్..
  • స్పెషల్ ఎడిషన్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో..
  • మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే రెండు ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లు..
Tata Nexon Camo

Tata Nexon Camo

Tata Nexon Camo Edition: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో టాటా నెక్సాన్ కామో ఎడిషన్ (Tata Nexon Camo Edition)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ SUV రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్స్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్ వంటి అప్‌గ్రేడ్‌లతో ఈ ఎడిషన్‌ను లాంచ్ అయ్యింది. అయితే ఇంజిన్ ఎంపికల్లో ఎలాంటి మార్పులు రాలేదు.

కామో డిజైన్:

ఈ కారుకు మున్నార్ మిస్ట్ (Munnar Mist), కూర్గ్ క్లౌడ్ (Coorg Cloud) అనే రెండు ప్రత్యేక రంగులను అందించారు. ముందు ఫెండర్లపై కామో బ్యాడ్జింగ్ ను జోడించడం ద్వారా ఈ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు. మొత్తం డిజైన్ మాత్రం రెగ్యులర్ నెక్షన్ మాదిరిగానే కొనసాగింది.

పెద్ద టచ్‌స్క్రీన్, కొత్త డ్యాష్‌క్యామ్:

ఇంటీరియర్‌లో కూడా కామో థీమ్‌ను కొనసాగించారు. ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై ‘Camo’ పెర్ఫొరేషన్ డిజైన్ ను అందించారు. ఈ ఎడిషన్‌లో 12.3-అంగుళాల హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ హైలెట్. ఇది సాధారణ నెక్షన్ లో ఉండే 10.25 అంగుళాల స్క్రీన్ స్థానంలో వచ్చింది. అయితే 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను యథాతథంగా కొనసాగించారు. అలాగే 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌తో పనిచేసే ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌క్యామ్ ను కూడా అందించారు. దీంతో ప్రయాణాల వీడియోలను ప్రత్యేకంగా డ్యాష్‌క్యామ్ అమర్చకుండా రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఫీచర్లు, సేఫ్టీ:

వేరియంట్‌ను బట్టి ఈ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, JBL 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కూడా అందించారు.

పెట్రోల్, డీజిల్, CNG ఇంజిన్ ఆప్షన్లు:

నెక్సాన్ కామో ఎడిషన్లో ఇప్పటికే ఉన్న ఇంజిన్ ఎంపికలనే కొనసాగించారు. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఎడిషన్ 120hp పవర్, 170Nm టార్క్ అందిస్తుండగా.. 1.5-లీటర్ డీజిల్ వేరియంట్ 115hp పవర్, 260Nm టార్క్ ను, అలాగే 1.2-లీటర్ టర్బో CNG కారు 100hp పవర్, 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్, AMT, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.