Site icon NTV Telugu

Tata Motors: టాటా డిసెంబర్ ఆఫర్.. రూ. 4,999 EMIతోనే కార్ ఇంటికి తీసుకెళ్లొచ్చు..

Tata Motors

Tata Motors

Tata Motors: టాటా ఇయర్ ఎండ్ తన సేల్స్ పెంచుకునేందుకు డిసెంబర్ నెలలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లను ICE (పెట్రోల్–డీజిల్), EV (ఎలక్ట్రిక్) మోడళ్లన్నిటికీ వర్తిస్తున్నట్లు చెప్పింది. ఈ స్కీమ్ డిసెంబర్ 31,2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు ఎంపిక చేసిన టాటా కార్లను నెలకు రూ. 4999 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ EMIతో ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఎంట్రీ లెవల్ టియాగో నెలకు రూ. 4999 నుంచి EMIతో అందుబాటులో ఉంది. టిగోర్, పంచ్ కార్లకు రూ. 5999 నుంచి EMI ప్రారంభవుతాయి. ఆల్ట్రోజ్, నెక్సాన్ వంటి ప్రముఖ టాటా కార్ల మోడళ్లకు వరసగా నెలకు రూ. 6,777, రూ. 7,666 నుంచి ఫైనాన్స్ ప్రారంభమవుతుంది. కర్వ్ SUV కూడా EMIలు రూ. 9,999 నుండి ప్రారంభమవుతాయి.

టాటా తన ఈవీ కార్లకు కూడా ఈ స్కీమ్‌ను వర్తింపచేస్తోంది. Tiago.ev నెలకు రూ. 5,999 నుండి ప్రారంభమవుతుంది. Punch.ev రూ. 7,999 నుండి లభిస్తుంది. Nexon.ev EMIలు రూ. 10,999 నుండి ప్రారంభమవుతాయి. Curvv.ev నెలకు రూ. 14,555 EMIతో కొనుక్కోవచ్చు.

ICE (పెట్రోల్–డీజిల్) కార్లపై EMI ఆఫర్లు

*Tiago – ₹4,999 / నెల

*Tigor – ₹5,999 / నెల

*Punch – ₹5,999 / నెల

*Altroz – ₹6,777 / నెల

*Nexon – ₹7,666 / నెల

*Curvv SUV – ₹9,999 / నెల

ఎలక్ట్రిక్ (EV) కార్లపై EMI ఆఫర్లు

*Tiago.ev – ₹5,999 / నెల

*Punch.ev – ₹7,999 / నెల

*Nexon.ev – ₹10,999 / నెల

*Curvv.ev – ₹14,555 / నెల

కంపెనీ  ప్రకారం, EMI లెక్కలు లోన్ అమౌంట్, కాలపరిమితి నిర్మాణాలపై ఆధారపడి ఉంటాయని చెబుతోంది. ఇందులో ICE వాహనాలకు బెలూన్ ఫైనాన్స్ ఆఫ్షన్ అందిస్తుంది. ఈవీ వాహనాలకు లాంగ్ టెన్యూర్ లోన్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఆన్ రోడ్ ధర, లోన్ అమౌంట్, ఫైనాన్షియర్ నిబంధనల్ని బట్టి తుది EMI మార్పులు ఉంటాయి. కొనుగోలుదారులు ఈ ఆఫర్లను ఆథరైజ్డ్ టాటా మోటార్స్ డీలర్ షిష్, కంపెనీ అధికారి వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

Exit mobile version