Tata Harrier EV: ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో టాటా దూసుకుపోతోంది. ప్రస్తుతం EV కార్ సెగ్మెంట్‌లోనే టాప్ ప్లేస్‌లో ఉంది. అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో టాటా నెక్సాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. టాటా నుంచి నెక్సాన్ కాకుండా పంచ్, టియాగో, టిగోర్ ఈవీ వెర్షన్లలో లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఆగస్టులో కర్వ్ EVని లాంచ్ చేసింది.
ఇదిలా ఉంటే, టాటా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్ EVని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త EVలను ప్రవేశపెట్టే ప్రణాళికలను కంపెనీ మొదట్లో ప్రకటించింది. ఆగస్ట్‌లో Curvv EVని లాంచ్ చేసిన తర్వాత, టాటా మోటార్స్ ఇప్పుడు హారియర్ ఈవీని 2024-2025 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. మార్చి 2025లో హారియర్ EVని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: BGT: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది..? ఆధిపత్యం ఆ జట్టుదే
హారియర్ EVలో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్ అప్‌డేట్ కనిపిస్తున్నాయి. దీంట్లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రెయిర్ AC వెంట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్‌తో సహా హారియర్ ICE (పెట్రోల్, డిజిల్) కార్‌లో ఉన్న అన్ని ఫీచర్లను కలిగి ఉండబోతోంది. భద్రత పరంగా మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS,360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటర్‌ను కలిగి ఉండబోతోంది.
దాదాపుగా దీని ధర రూ.25(ఎక్స్-షోరూం) వద్ద ఉండే అవకాశం కనిపిస్తోంది. హారియల్ ఈవీ XEV 9e, Mahindra XUV.e8, మారుతి eVX మరియు BYD Atto 3 కార్ మోడళ్లతో పోటీపడనుంది.