Site icon NTV Telugu

కొత్త అవతారంలో Jimny, రేస్ మోడ్‌లో Swift..”Life with Adventure” థీమ్‌తో 9 కార్ల ప్రదర్శన

Suzuki

Suzuki

Suzuki at Tokyo Auto Salon 2026: జపాన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆటో ఈవెంట్ టోక్యో ఆటో సెలూన్ 2026కు సుజుకి సరికొత్త కాన్సెప్ట్‌లతో సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఈవెంట్ థీమ్ “Life with Adventure”గా ఉండగా, బ్రాండ్ అడ్వెంచర్, యుటిలిటీ, రేసింగ్ ఫోకస్‌తో మొత్తం 9 ప్రత్యేక వాహనాలను ప్రదర్శించనుంది.

Read Also: Shivaji: పాపం శివాజీ.. చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటే!

సుజుకి జిమ్నీ నోమాడ్ – మాన్‌స్టర్ హంటర్ వైల్డ్స్ ఎడిషన్
* భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ SUVగా విక్రయిస్తున్న ఈ మోడల్, జపాన్ మార్కెట్లో జిమ్నీ నోమాడ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే మోడల్‌ను Monster Hunter Wilds Editionగా సరికొత్త అవతారంలో ప్రదర్శించనున్నారు. కాగా, ఈ స్పెషల్ ఎడిషన్ క్యాప్‌కామ్ (Capcom) సంస్థతో కలిసి సుజుకి డెవలప్ చేసింది. ప్రముఖ గేమ్ మాన్‌స్టర్ హంటర్ వైల్డ్స్ (Monster Hunter Wilds)ను ప్రమోట్ చేసేలా ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ రెండు సంస్థల కలయికలో భాగంగా DR-Z4S మోటార్‌సైకిల్‌కూ Monster Hunter గేర్ అప్‌గ్రేడ్స్ జోడించారు. అయితే, “మాన్‌స్టర్ హంటర్ ప్రపంచంలో సుజుకి ఉంటే ఎలా ఉంటుంది?” అనే ఊహకు సమాధానంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొనింది. సాహసోపేత డ్రైవింగ్‌కు ప్రేరణ ఇచ్చేలా, అడ్వెంచర్ స్పిరిట్‌ను రగిలించేలా ఈ మోడల్‌ను రూపొందించామని సుజుకి తెలిపింది.

Read Also: Rakul Preet Brother: టాలీవుడ్‌లో ప్రకంపనలు.. డ్రగ్స్ కేసులో మళ్ళీ ఇరుక్కున్న రకుల్ ప్రీత్ సోదరుడు

జిమ్నీలో ప్రధాన మార్పులు:
* గేమ్ ప్రేరణతో రూపొందించిన మల్టీ-షేడ్ గ్రాఫిక్ కాస్ట్యూమ్ ర్యాప్
* ఆఫ్-రోడ్ లుక్, యుటిలిటీ పెంచేలా రూఫ్ ర్యాక్
* కొత్త డిజైన్ అలాయ్ వీల్స్
* బంపర్‌లో స్వల్ప స్టైలింగ్ మార్పులు

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ – సూపర్ తైక్యు రేస్ స్పెసిఫికేషన్
* ఈ షోలో మరో ప్రత్యేక ఆకర్షణ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ – సూపర్ తైక్యు రేస్ స్పెసిఫికేషన్ నిలిచింది. ఇది పాత తరం (previous generation) స్విఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది. కొత్త Swiftకు ఇంకా Sport వేరియంట్ విడుదల కాలేదు. ఈ రేస్ ఎడిషన్ ఇటీవల 2025 ఎనియోస్ సూపర్ తైక్యు సిరీస్ లో పాల్గొంది. దీర్ఘకాల ట్రాక్ పని తీరుకు అనుగుణంగా పూర్తి రేసింగ్ స్పెక్స్‌తో దీనిని సిద్ధం చేస్తున్నారు.

ఈ రేస్ వెర్షన్‌లోని ప్రధాన మార్పులు:
* రోడ్ మోడల్‌లో ఉన్న 1.2-లీటర్ ఇంజిన్ స్థానంలో 1.4-లీటర్ టర్బో ఇంజిన్
* Super Taikyu రేస్ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ ట్యూనింగ్
* పూర్తి రేసింగ్ సేఫ్టీ గేర్, రోల్ కేజ్, ట్రాక్-రెడీ అప్‌గ్రేడ్స్
* పని తీరు, డ్యూరబులిటీ (durability) లక్ష్యంగా ఎండ్యూరెన్స్ ఫోకస్‌డ్ ట్యూనింగ్.. ఇది సాధారణ రోడ్ కార్ కంటే పూర్తిగా భిన్నమైన పెర్ఫార్మెన్స్ & ఎండ్యూరెన్స్ ఫోకస్‌డ్ రేసింగ్ మోడల్ అని సుజుకి తెలిపింది.

అడ్వెంచర్ + యుటిలిటీ ఫోకస్
కాగా, ఈ ఏడాది సుజుకి ప్రదర్శించే కాన్సెప్ట్‌లు, ప్రత్యేక ఎడిషన్లన్నీ రగ్గడ్ డిజైన్, ఎక్కువ యుటిలిటీ, సాహసోపేత వినియోగం లక్ష్యంగా రూపొందించబడ్డాయి. రోజువారీ జీవితం, అడ్వెంచర్ రెండింటినీ సమతుల్యం చేసేలా తన బ్రాండ్ దృక్పథాన్ని ఈ షోలో సుజుకి ప్రతిబింబించనుంది. కార్లతో పాటు GSX-8TT, DR-Z4S వంటి అడ్వెంచర్ బైక్స్ కూడా ప్రదర్శనలో ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.

Exit mobile version