రివోల్ట్ మోటార్స్ భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని విస్తరించింది. కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ (Revolt RV BlazeX) ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో కూడిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్‌వీ1 కంటే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది.
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది. ముందు భాగంలో స్టోరెజ్ బాక్స్, సీటు కింద ఛార్జర్ కంపార్ట్‌మెంట్ వంటి కొత్త ఫీచర్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బుకింగ్స్ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ. 499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
లుక్, డిజైన్ పరంగా ఈ బైక్.. కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఎంట్రీ లెవల్ మోడల్ రివోల్ట్ ఆర్‌వీ1ని పోలి ఉంటుంది. ఇది గుండ్రని ఆకారపు హెడ్‌ల్యాంప్ అమర్చారు. పెట్రోల్ ట్యాంక్ స్థానంలో మస్క్యులర్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో సింగిల్-పీస్ సీటు, గ్రాబ్ రైల్ అమర్చారు. ఈ బైక్ రోజువారీ ప్రయాణీకులకు చాలా సౌకర్యంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అధునాతన ఫీచర్లు చేర్చారు. ఇందులో అమర్చిన 6-అంగుళాల LCD స్క్రీన్.. బైక్ వేగం, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్రైవింగ్ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం వంటి అనేక ముఖ్యమైన సమాచారాలను ప్రదర్శిస్తుంది. ఈ బైక్‌లో 3 విభిన్న రైడింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్, జీపీఎస్ తో జియోఫెన్సింగ్ వంటి యాప్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా కంపెనీ చేర్చింది.
బ్యాటరీ ప్యాక్, రేంజ్…
బ్లేజ్ ఎక్స్‌లో కంపెనీ 3.24 kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీతో బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఇది 5.49 bhp పవర్ అవుట్‌పుట్, 45 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. అంతే కాదు .. 80 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. గంటకు 85 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది.
హార్డ్‌వేర్‌లు:
ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ ముందు, వెనుక రెండింటిలోనూ 240 mm డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. సీటు ఎత్తు కూడా 790mm ఉంటుంది. దీని వీల్‌బేస్ 1350 మి.మీ, గ్రౌండ్ క్లియరెన్స్ 80 మిమీ. అయితే.. ఈ బైక్ మొత్తం బరువు 113 కిలోలు. కంపెనీ IP67-రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది దుమ్ము, సూర్యకాంతి, నీటిని తట్టుకుంటుంది.