Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
- లిమిటెడ్ ఎడిషన్ Range Rover Sport విడుదల
- 537HP ఇంజన్‌తో దూసుకుపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Range Rover Sport Twenty Edition: లగ్జరీ SUV విభాగంలో ప్రత్యేకతను చాటుకుంటున్న Range Rover మరో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Jaguar Land Rover (JLR) తాజాగా Range Rover Sport Twenty Editionను తీసుకొచ్చింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక ఎడిషన్ ధర రూ.1.90 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త కలర్, స్పెషల్ బ్యాడ్జింగ్, స్పోర్టీ డిజైన్‌తో పాటు శక్తివంతమైన 537hp ఇంజన్ ఈ SUV ప్రత్యేకతలుగా ఉన్నాయి. భారతదేశంలో ఈ లిమిటెడ్ ఎడిషన్ డెలివరీలు అక్టోబర్ 2026లో ప్రారంభం కానున్నాయి.
ధర ఎంత?
Range Rover Sport Twenty Editionను భారతదేశంలో రూ.1.90 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. ఇది సాధారణ మోడల్‌కు భిన్నంగా ప్రత్యేక డిజైన్, ఇంటీరియర్ వివరాలు, స్పెషల్ కలర్ ఆప్షన్లతో రూపొందించిన లిమిటెడ్ ఎడిషన్. కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ వెర్షన్‌ను విక్రయించనుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌కు 2004లో ఆవిష్కరించిన Range Stormer కాన్సెప్ట్ స్ఫూర్తిగా నిలిచింది. అప్పటి కాన్సెప్ట్‌లో కనిపించిన స్పోర్టీ, బోల్డ్ డిజైన్ అంశాలను ఆధునిక Range Rover Sportతో కలిపి Twenty Editionను రూపొందించారు. దీంతో ఈ SUV సాధారణ Range Rover Sportతో పోలిస్తే మరింత ప్రత్యేకమైన లుక్‌ను కలిగి ఉంటుంది.
Also Read
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
- Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ప్రత్యేకమైన Sanguinello Orange కలర్
Range Rover Sport Twenty Editionలో ప్రధాన ఆకర్షణ దాని కొత్త పెయింట్ ఫినిష్. దీనికి ప్రత్యేకంగా Ultra-Metallic Sanguinello Orange కలర్‌ను అందించారు. ఈ రంగు Stormer Orange Range Rover కాన్సెప్ట్ తో పాటు Vesuvius Orange First Edition Range Rover నుంచి స్ఫూర్తి పొందింది. ఇక ఆరెంజ్ కలర్ నచ్చని వారికి Santorini Black, Ostuni White అనే రెండు ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
23-అంగుళాల ప్రత్యేక వీల్స్
SUVకు మరింత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ అందించేందుకు కొత్త బ్లాక్ ఎక్స్టీరియర్ ప్యాక్ ఇచ్చారు. దీనికి తోడు సిల్వర్-బ్లాక్ ఫినిషింగ్‌తో 23-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకతను తెలియజేసేందుకు ఎక్స్టీరియర్లో Twenty బ్యాడ్జింగ్, ప్రత్యేక డీటైలింగ్ కూడా ఉన్నాయి. క్యాబిన్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రత్యేక ఎడిషన్‌కు సంబంధించిన డిజైన్ ఎలిమెంట్లు కనిపిస్తాయి.
స్కఫ్ ప్లేట్లపై ఇల్యూమినేటెడ్ ‘Twenty’ బ్యాడ్జింగ్, సెంటర్ కన్సోల్‌పై ‘Twenty’ లెటరింగ్ ఉన్నాయి. సీట్ల విషయంలో Range Rover Sport SV నుంచి తీసుకున్న Ebony Windsor Leather సీట్లను ఉపయోగించారు. అంతేకాకుండా క్యాబిన్‌ను మరింత ప్రీమియంగా కనిపించేలా Forged Carbon Veneer, బ్లాక్ Suede-cloth Headlining, ప్రత్యేక Twenty బ్యాడ్జింగ్, ప్రీమియం లెదర్ సీట్లు వంటి అంశాలను అందించారు.
537HP పవర్.. 750Nm టార్క్
పనితీరు విషయానికి వస్తే Range Rover Sport Twenty Editionలో 4.4-లీటర్ ట్విన్-టర్బో మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఈ పవర్ఫుల్ ఇంజన్.. గరిష్ఠ పవర్ 537 hp
గరిష్ఠ టార్క్ 750 Nm, ఇంజన్ 4.4-లీటర్ Twin-Turbo Mild-Hybrid, 4.5 సెకన్లలో 0-100 kmph అందిస్తుంది. అంటే భారీ SUV అయినప్పటికీ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.
అక్టోబర్ 2026 నుంచి డెలివరీలు
భారత మార్కెట్లో Range Rover Sport Twenty Edition డెలివరీలు అక్టోబర్ 2026లో ప్రారంభం కానున్నాయి. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే లభించనున్నందున, ఈ ప్రత్యేక ఎడిషన్‌పై ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ముందుగానే బుకింగ్ వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!