భారతదేశంలో అప్‌డేట్ చేసిన పోర్స్చే 911 టర్బో ఎస్ కారును విడుదల చేశారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన IAA మొబిలిటీ 2025లో ఈ కారును ప్రారంభించారు. అయితే ఈ కారు పోర్స్ అత్యంత శక్తివంతమైన 911 మోడల్ అని.. T-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉందని పోర్స్చే యాజమాన్యం వెల్లడించింది.
Read Also: Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై చోరీలకు పాల్పడుతున్న దొంగలు
భారతదేశంలో అప్‌డేట్ చేసిన 911 టర్బో ఎస్‌ను.. కొద్ది నెలల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా లాంఛ్ చేశారు. ఇండియాలో ఈ రెండు-డోర్ల కూపే ఎక్స్-షోరూమ్ ధర 3.80 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది కంపెనీ యాజమాన్యం. అయితే ఈ కారు అత్యంత శక్తివంతమైన 911 మోడల్ అని.. T-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉందని ప్రకటించింది. ఇది విలాసవంతమైన అనుభూతి, శక్తివంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందినదిగా చెబుతున్నారు కంపెనీ సిబ్బంది.
Read Also:Cherry Fruits: చెర్రీ పండ్లు మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..
పోర్స్చే కొత్త కారు క్యాబిన్ టర్బోక్‌నైట్ ఇంటీరియర్ ట్రిమ్‌తో వస్తుంది. ఈ కారులో GT స్పోర్ట్ స్టీరింగ్ వీల్ కూడా ఉందని కంపెనీ సిబ్బంది తెలిపారు. అయితే. డ్యాష్‌బోర్డ్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ ,అనలాగ్ క్లాక్ ఉన్నాయన్నారు. ఇందులో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్పోర్ట్ సీట్లు ఉండడం విశేషం. పోర్షే 911 టర్బో ఎస్ కారులో 3.6-లీటర్ ఫ్లాట్-సిక్స్ హైబ్రిడ్ ఇంజిన్, టి-హైబ్రిడ్ సిస్టమ్ తో కలిపి ఉంటుందన్నారు.
Read Also:Gang Rape: యువకుడిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన నలుగురు మహిళలు
పోర్షే కారులోని అదనపు టర్బోచార్జర్ 711 బిహెచ్‌పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని కంపెనీ ఎక్స్ పర్ట్స్ తెలిపారు. . ఈ ఇంజిన్ 8-స్పీడ్ పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిందని.. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో అనుసంధానించబడిందని చెప్పుకొచ్చారు. ఈ పోర్స్చే కారు లగ్జరీ లక్షణాల కలయిక మాత్రమే కాదు, శక్తి , పనితీరులో కూడా ముందుంటుంటున్నారు.
