Ola S1 Pro Plus vs Ather 450 Apex: భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్ మరింత హీట్ పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీ, అత్యుత్తమ పనితీరు, ఆకట్టుకునే రేంజ్ పరంగా Ather 450 Apex (2025), Ola S1 Pro Plus స్కూటర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండింటిలో మీ అవసరాలకు ఏది సరిపోతుందో ఒకసారి చూసేద్దాం.
ఏథర్ 450 అపెక్స్ (2025):
ఏథర్ తన 2025 450 అపెక్స్ మోడల్‌లో ప్రవేశపెట్టిన ‘Infinite Cruise’ ఫీచర్ ఈ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణ. ఇది సాధారణ క్రూయిజ్ కంట్రోల్ కంటే ఎంతో అడ్వాన్స్‌డ్‌గా పనిచేస్తూ, నగర ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈ స్కూటర్ 3.7 kWh బ్యాటరీతో 157 కి.మీ (ARAI) రేంజ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫీచర్లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఇష్టపడే వారికి ఏథర్ మంచి ఎంపిక. ఇన్‌ఫినిట్ క్రూయిజ్ మూడు ప్రత్యేక మోడ్‌లు కలిగి ఉన్నాయి. ఇందులో సిటీ క్రూయిజ్ నగర ట్రాఫిక్‌లో పదేపదే థ్రాటిల్ ఇచ్చే పనిలేకుండా ఒకే వేగాన్ని నిలుపుతుంది. ఇంకా హిల్ క్రూయిజ్ ఎత్తైన రోడ్లపై అవసరమైన టార్క్‌ను అందిస్తూ, దిగువకు వచ్చేటప్పుడు రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో స్థిరమైన వేగాన్ని ఇస్తుంది. అలాగే క్రాల్ క్రూయిజ్ పార్కింగ్ సమయంలో లేదా ఇరుకైన రోడ్లలో గంటకు 10 కి.మీ. వేగంతో నెమ్మదిగా కదలడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Vivo X200T లాంచ్ తేదీ ఖరారు.. 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్స్..
ఓలా S1 ప్రో ప్లస్:
ఓలా తన S1 ప్రో ప్లస్ స్కూటర్‌తో పనితీరు (Performance) పరంగా కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఇందులో కొత్తగా అమర్చిన మిడ్-డ్రైవ్ మోటార్, చైన్ డ్రైవ్ వల్ల రైడింగ్ మరింత స్పోర్టీగా మారింది. ఇది ప్రధానంగా రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 5.3 kWh వేరియంట్ గంటకు గరిష్టంగా 141 కి.మీ వేగంతో దూసుకుపోవడమే కాకుండా, సింగిల్ ఛార్జ్‌పై 320 కి.మీ (IDC) భారీ రేంజ్‌ను ఇస్తుంది.
ఫీచర్లు, టెక్నాలజీ:
ఓలా S1 ప్రో ప్లస్‌లో హైపర్, స్పోర్ట్స్ వంటి విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. భద్రత కోసం సెగ్మెంట్-ఫస్ట్ డ్యుయల్ ABS, డ్యుయల్ డిస్క్ బ్రేక్స్‌ను అందించారు. ఇందులో ఉన్న బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ వల్ల 15% అదనపు రీజెనరేషన్ లభిస్తుంది. అలాగే కొత్త ‘MoveOS 5’ ద్వారా స్మార్ట్‌వాచ్ యాప్, ఎస్ఓఎస్ (SOS) మరియు లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
Xiaomi Kids Watch: షియోమీ కొత్త కిడ్స్ వాచ్.. మీ బిడ్డ ఏ ఫ్లోర్ లో ఉందో ఇట్టే కనిపెట్టొచ్చు!
పనితీరు, ధరల విశ్లేషణ:
ఓలా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 5.3 kWh మోడల్ ధర రూ. 1,69,999 కాగా, 4 kWh వేరియంట్ ధర రూ. 1,54,999గా ఉంది. మరోవైపు ఏథర్ 450 అపెక్స్ 9.39 bhp పవర్, 26 Nm టార్క్‌తో నగర వినియోగానికి సరిగ్గా సరిపోతుంది. ఏథర్ అందించే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ పాత యజమానులకు కూడా OTA అప్‌డేట్ ద్వారా లభించడం విశేషం.
ఏది బెస్ట్?
ఈ రెండు స్కూటర్లు కూడా వాటి విభాగాల్లో అత్యుత్తమమైనవే. మీ ప్రాధాన్యతలను బట్టి ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మీరు నగరంలో ఎక్కువగా ప్రయాణిస్తూ, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, సౌకర్యవంతమైన రైడింగ్ (Comfort) కోరుకుంటే ఏథర్ 450 అపెక్స్ ఉత్తమమైనది. అదే ఎక్కువ దూరం ప్రయాణాలు చేస్తూ మెరుపు వేగంతో కూడిన యాక్సిలరేషన్, స్పోర్టీ ఫీల్ కావాలనుకుంటే ఓలా S1 ప్రో ప్లస్ బెస్ట్ ఛాయిస్.
