Odysse Sun: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఓడిసీ (Odysse) సంస్థ తమ కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓడిసీ సన్ (Odysse Sun)ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.81,000గా, అలాగే హై ఎండ్ మోడల్ ధర రూ.91,000గా నిర్ణయించారు. వినియోగదారులు 1.95 kWh, 2.9 kWh లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
డిజైన్, ఫీచర్లు:
ఓడిసీ సన్ పెద్ద సైజు ఎర్గోనామిక్ డిజైన్‌తో వస్తుంది. ఇది రైడింగ్ కంఫర్ట్‌కి ప్రాధాన్యం ఇస్తూ స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇది పటినా గ్రీన్, గన్‌మెటల్ గ్రే, ఫాంటమ్ బ్లాక్, ఐస్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. డిజైన్‌లో LED లైటింగ్, ఏవియేషన్-గ్రేడ్ సీటింగ్, 32 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ వంటి అంశాలు ఉన్నాయి.
సస్పెన్షన్, బ్రేకులు:
స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో హైడ్రాలిక్ మల్టీ-లెవెల్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేకులు అమర్చబడ్డాయి. ఫీచర్లలో కీ-లెస్ స్టార్ట్-స్టాప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డబుల్ ఫ్లాష్ రివర్స్ లైట్ ఉన్నాయి. డ్రైవ్, పార్కింగ్, రివర్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
TSRTC Record: రాఖీ పౌర్ణమికి రికార్డు ప్రయాణాలు.. టీఎస్ఆర్టిసీ చరిత్రలో ఇదే తొలిసారి!
పర్ఫార్మెన్స్, రేంజ్:
ఈ కొత్త ఓడిసీ సన్ లో 2,500 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది గరిష్టంగా 70 kmph వేగాన్ని అందిస్తుంది. 1.95 kWh బ్యాటరీతో ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 85 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. పెద్ద 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ రేంజ్ 130 కి.మీ. వరకు వెళ్లవచ్చు. ఈ స్కూటర్ ధర, డిజైన్, ఫీచర్ల పరంగా చూస్తే భారతీయ వినియోగదారులకు ఒక ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలవనుంది.
