Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్‌తో అదిరిపోయే బైక్
- రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo
- 180KM రేంజ్
- ఓబెన్ రోర్ ఎవోలో 5-అంగుళాల TFT డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Oben Electric తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ Oben Rorr Evoను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ఆకట్టుకునే రేంజ్, అధునాతన ఫీచర్లతో ఈ బైక్ యువతను టార్గెట్ చేస్తోంది. ఒకే ఛార్జ్‌పై 180 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఓబెన్ రోర్ ఈవో ప్రారంభ ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అయితే ఈ ధర మొదటి 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ధర రూ.1.25 లక్షలకు పెరగనుంది. ఈ బైక్ నీలం, ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఓబెన్ రోర్ ఈవోలో 3.4 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీనికి IP67 రేటింగ్ ఉండగా, బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తున్నారు. ఇందులో కంపెనీ అభివృద్ధి చేసిన I-PMSM మోటార్ ఉంది.
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
గరిష్ట పవర్: 9 kW
వీల్ టార్క్: 250 Nm
IDC రేంజ్: 180 కి.మీ.
వాస్తవ రేంజ్: సుమారు 150 కి.మీ.
గరిష్ట వేగం: 110 km/h
0 నుంచి 40 km/h వేగం: 5 సెకన్లు
ఈ బైక్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అందించారు. అలాగే 270mm డిస్క్ బ్రేకులు, రెండు చక్రాలపై CBS (Combined Braking System) ఉన్నాయి.
డిజైన్ & డైమెన్షన్స్
సీటు ఎత్తు: 780 mm
సీటు వెడల్పు: 680 mm
గ్రౌండ్ క్లియరెన్స్: 200 mm
మొత్తం బరువు: 140 kg
కొత్త ఫ్రంట్ డిజైన్‌తో పాటు ప్రొజెక్టర్ హెడ్‌లైట్, హారిజాంటల్ DRLs, ఆల్-LED లైటింగ్ అందించారు.
స్మార్ట్ ఫీచర్లు
ఓబెన్ రోర్ ఎవోలో 5-అంగుళాల TFT డిస్ప్లే ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎకో, రోడ్, హావోక్, మరియు స్మార్ట్ IQ అనే నాలుగు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఇందులోని Smart IQ మోడ్ AI ఆధారంగా రైడింగ్ ప్యాటర్న్‌ను విశ్లేషించి రేంజ్ అంచనా వేస్తుంది. అదనంగా ఫాల్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంది.
స్టోరేజ్ & ఛార్జింగ్
సీటు కింద: 6 లీటర్ల స్టోరేజ్
ట్యాంక్ స్టోరేజ్: 4 లీటర్లు
USB పోర్ట్స్: 2
ఛార్జింగ్: Oben Plug + 15A సాకెట్ సపోర్ట్
మొత్తానికి, స్టైలిష్ లుక్, మంచి రేంజ్, స్మార్ట్ ఫీచర్లతో Oben Rorr Evo ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో మంచి పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!