Nissan Magnite Kuro Edition: నిస్సాన్ ఇండియా తన మ్యాగ్నైట్ SUV శ్రేణిని పెంచుతూ, భారత మార్కెట్‌లో కొత్తగా “Magnite Kuro Edition” ను ప్రవేశపెట్టింది. జపనీస్ భాషలో “Kuro” అంటే “నలుపు. కాబట్టి ఈ వెర్షన్ మొత్తం నలుపు కాన్సెప్ట్‌తో ఆకట్టుకునేలా రూపొందించబడింది. కురో ఎడిషన్‌లో ప్రత్యేకంగా ఒనిక్స్ బ్లాక్ పెయింట్ స్కీమ్ ను ఉపయోగించారు. దీని బాడీపై మెరిసే కొన్ని భాగాలను తొలగించి, బ్లాక్ గ్రిల్, బ్లాక్ బంపర్లు ఏర్పాటు చేశారు. వెనుక వైపున కూడా బ్లాక్ బంపర్ తో పాటు క్రోమ్ మాగ్నైట్ లెటరింగ్, కురో బ్యాడ్జింగ్ ను తీసుకవచ్చారు. అంతేకాదండోయ్ ఈ కారు అల్లాయ్ వీల్స్ కూడా నలుపు రంగులో ఉండి, వాటిపై సిల్వర్ ఇన్‌సర్ట్స్ ఇచ్చారు. ఈ బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌కి ప్రారంభ ధర 8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
Top Selling Cars: భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడబోతున్న కార్లు ఇవే!
ఇక కారు ఇంటీరియర్‌లోనూ నలుపే మెయిన్ అట్రాక్షన్. డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్, రూఫ్ ఇలా అన్నీ బ్లాక్ ఫినిష్‌లో ఉన్నాయి. కురో ఎడిషన్ ని N-Connecta వేరియంట్ ఆధారంగా రూపొందించారు. అందువల్ల దీనిలో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, ఆటో డిమ్మింగ్ IRVM, ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, i-Key ఆటో అన్లాక్, క్లైమేట్ కంట్రోల్ (రియర్ ఏసీ వెంట్స్‌తో), ఇల్యూమినేటెడ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్లన్నీ అందుబాటులో ఉంచారు. మ్యాగ్నైట్ కురో ఎడిషన్‌కి రెండు ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో మొదటగా 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ లో 71hp పవర్, 96Nm టార్క్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. ఇక అలాగే CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 98hp పవర్, 160Nm టార్క్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది.
JK: జమ్మూ కాశ్మీర్‌లో విషాదం.. లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు జవాన్లు మృతి
నిస్సాన్ మ్యాగ్నైట్ కురో ఎడిషన్‌ను కంపెనీ వివిధ పవర్‌ట్రెయిన్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. బేస్ వేరియంట్ అయిన 1.0 లీటర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT) వేరియంట్‌కి ఎక్స్-షోరూమ్ ధర రూ.8.30 లక్షలు కాగా, అదే ఇంజిన్‌కు ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) వేరియంట్‌కి ధర రూ.8.55 లక్షలు. మరింత శక్తివంతమైన టర్బో ఇంజిన్ ఎంపిక కోసం చూస్తున్న వినియోగదారులకు, 1.0 లీటర్ టర్బో MT వేరియంట్ ని రూ.9.71 లక్షలకు, మరియు CVT వేరియంట్‌ను రూ.10.86 లక్షలకు అందిస్తున్నారు. ఈ SUV కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి, మీ డ్రీమ్ బ్లాక్ ఎడిషన్ SUVను ముందుగా బుక్ చేసుకోవచ్చు. స్టైలిష్ బ్లాక్ ఎక్స్‌టీరియర్, ఆకర్షణీయ ఫీచర్లు, మంచి మైలేజ్, రెండు ఇంజిన్ ఆప్షన్లతో నిస్సాన్ మ్యాగ్నైట్ కురో ఎడిషన్ ప్రీమియమ్ లుక్స్‌ను సరసమైన ధరలో అందించేందుకు సిద్ధంగా ఉంది.
