Site icon NTV Telugu

AI ఫీచర్లతో Nissan Gravite లాంచ్‌.. తక్కువ ధరలో 7 సీటర్‌ కారు..

Nissan Gravite

Nissan Gravite

Nissan Gravite: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం Nissan భారత మార్కెట్లో కొత్త 7-సీటర్ MPV ‘Gravite’ను విడుదల చేసింది. ఉదయపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన AI ఫీచర్లు, సరసమైన ధరతో ఈ కారు కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా తీసుకుని రూపొందించబడింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.65 లక్షలుగా పేర్కొన్నారు..

* దేశంలోనే అత్యంత సరసమైన 7-సీటర్?
రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో Gravite ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 7-సీటర్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇది Renault సంస్థకు చెందిన Renault Triber ఆధారంగా అభివృద్ధి చేయబడిన మోడల్‌గా భావిస్తున్నారు. మార్కెట్లో ఇది Maruti Suzuki Ertiga వంటి MPVలకు పోటీగా నిలవనుంది.

* బోల్డ్ డిజైన్ – కొత్త స్టైలింగ్
Gravite డిజైన్‌లో కొత్త DRL సిగ్నేచర్ హెడ్‌ల్యాంపులు, తేనె తొట్టి ఆకృతిలో గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, C-ఆకారపు సిల్వర్ ఇన్సర్ట్‌లతో రీడిజైన్ చేసిన బంపర్లు ఉన్నాయి. ఫారెస్ట్ గ్రీన్, ఒనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, స్నో వైట్, మెటాలిక్ గ్రే వంటి రంగుల్లో లభిస్తుంది.

* కేబిన్‌ మరియు సీటింగ్
5+2 సీటింగ్ లేఅవుట్‌తో రూపొందించిన ఈ MPVలో సరళమైన డ్యాష్‌బోర్డ్ డిజైన్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, అనేక స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి. హై వేరియంట్లలో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే అందుబాటులో ఉన్నాయి.

* AI వాయిస్ అసిస్టెంట్ ‘Akira’
ఈ కారులో ప్రత్యేక ఆకర్షణ AI ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ‘Akira’. వాయిస్ కమాండ్ల ద్వారా నావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఫీచర్లను నియంత్రించవచ్చు. అయితే లాంచ్ కార్యక్రమంలో డెమో సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఫీచర్ సరిగా పనిచేయలేదు.

* ఫీచర్లు
– వైర్‌లెస్ Apple CarPlay, Android Auto
– పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
– క్రూయిజ్ కంట్రోల్
– ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్స్
– రెయిన్ సెన్సింగ్ వైపర్లు
– 6 ఎయిర్‌బ్యాగులు
– రియర్ AC వెంట్స్
– ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
– రివర్స్ కెమెరా
– టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
– వైర్‌లెస్ ఛార్జింగ్

* ఇంజిన్ మరియు మైలేజ్
1.0 లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు 72 hp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి… మాన్యువల్ మైలేజ్ లీటర్‌కు 19.3 కిలో మీటర్లు ఉండగా.. AMT మైలేజ్ 19.6 కిలోమీటర్లుగా ఉంది.. త్వరలో CNG వెర్షన్ కూడా లాంచ్‌ చేయనున్నారు.. కంపెనీ ఈ మోడల్‌ను డ్యూయల్-సిలిండర్ CNG కిట్‌తో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. నిర్వహణ ఖర్చు కిమీకి సుమారు 40 పైసల వరకు ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version