Renault Duster Launch: రెనాల్ట్ డస్టర్ మరోసారి భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2025 జనవరి 26వ తేదీన కొత్త తరం రెనాల్ట్ డస్టర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. తొలిసారిగా 2012లో భారత్‌లో ప్రవేశించిన డస్టర్, దాదాపు పదేళ్ల పాటు మంచి గుర్తింపు పొందింది. అయితే, అమ్మకాలు తగ్గడం, కఠినమైన BS6 ఎమిషన్ నిబంధనల కారణంగా 2022లో ఈ SUV ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు మూడో తరం మోడల్‌గా తిరిగి వస్తున్న డస్టర్, గత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా అప్‌గ్రేడ్ అవుతోంది. కొత్త రెనాల్ట్ డస్టర్‌ను CMF-B ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మెరుగైన ఎలక్ట్రానిక్స్, అధునాతన భద్రతా వ్యవస్థలు, ఆధునిక పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందించనున్నారు.
Read Also: Amardeep : “సుమతీ శతకం” నుండి మెలోడియస్ అప్‌డేట్..
ఇంజిన్ ఆప్షన్లు
కొత్త డస్టర్‌లో ఇంజిన్ లైన్-అప్‌ను రెనాల్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, 156 హెచ్‌పీ శక్తినిచ్చే 1.3 లీటర్ HR13 టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించే ఛాన్స్ ఉంది. ఈ ఇంజిన్‌కు మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. అలాగే, ఎంట్రీ లెవల్ వేరియంట్లలో కిగర్‌లో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఎక్కువ పవర్‌తో అందించే అవకాశం ఉంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్
కొత్త డస్టర్‌కు ప్రత్యేకమైన డిజైన్‌ను అందించనున్నారు. గ్లోబల్ మోడల్‌తో పోలిస్తే భారత మార్కెట్‌కు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్లలో రియర్ LED లైట్ బార్, రియర్ వైపర్, వాషర్, టర్న్ సిగ్నల్స్‌తో కూడిన కొత్త LED DRLs, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు కనిపిస్తున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన ముందు, వెనుక బంఫర్లు, కొత్త అలాయ్ వీల్స్ కూడా ఆకర్షణగా ఉండనున్నాయి.
Read Also: Harish Shankar : అహంకారం కాదు.. అనుబంధం ముఖ్యం: ఫ్యాన్స్‌ను అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
ఇంటీరియర్
కొత్త డస్టర్ ఇంటీరియర్ రగ్గడ్ లుక్‌తో పాటు ఆధునిక టచ్‌ను కలిగి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మోడల్‌లో ఆల్-బ్లాక్ లేదా డ్యూయల్-టోన్ ఇంటీరియర్ ఆప్షన్లు ఉన్నాయి. లేయర్డ్ డాష్‌బోర్డ్ డిజైన్, డ్రైవర్ వైపు మొగ్గు చూపే సెంటర్ కన్సోల్, హెక్సాగనల్ ఆకారంలో ఉన్న ఎయిర్ వెంట్స్ ఈ SUVకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించే ఛాన్స్ ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. ముఖ్యంగా, రెనాల్ట్ ఇండియాలో తొలిసారిగా డస్టర్‌లో ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అంచనా ధర
కొత్త రెనాల్ట్ డస్టర్ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, రేపు ధరలను వెల్లడించే ఛాన్స్ ఉంది. హ్యుందాయ్ క్రెటాకు ప్రత్యర్థిగా నిలిచే ఈ SUV ధర రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
