Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
- మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ లాంచ్
- రూ.6.10 లక్షలకే కొత్త పెట్రోల్ ఇంజన్
- Level-2 ADAS
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Baleno Facelift: మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు మిడ్-లైఫ్‌సైకిల్ అప్డేట్గా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్ మార్పులతో పాటు అదనపు ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లు, కొత్త పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో అందించారు. కొత్త బాలెనో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.10 లక్షలుగా ఉంది. కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయకపోయినా, ప్రీమియం లుక్‌ను మరింత మెరుగుపరిచేలా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇంటీరియర్, టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో కొత్త ఫీచర్లను జోడించారు. ఈ అప్డేట్తో బాలెనో మరింత ఆధునికంగా మారడంతో పాటు, ఈ సెగ్మెంట్లోని ఇతర కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా తయారైంది.
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు.. వైర్లెస్ ఛార్జింగ్
కొత్త బాలెనోలో అనేక ప్రీమియం ఫీచర్లను అందించారు. ఇందులో కూలింగ్‌తో కూడిన QI వైర్లెస్ ఛార్జర్, Clarion-tuned ప్రీమియం ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ముఖ్యంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఈ సెగ్మెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేసవి కాలంలో సీట్ల నుంచి వచ్చే వేడిని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. అలాగే SmartPlay Pro+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-లెదరెట్ సీట్ అప్హోల్స్టరీ, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
- Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
కొత్త ఇంటీరియర్ థీమ్
బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే కొత్త బ్లాక్ అండ్ బ్లూ ఇంటీరియర్ థీమ్, సిల్వర్ హైలైట్స్, కొత్త సీటింగ్ ఫినిషింగ్ వంటి మార్పులు చేశారు. క్యాబిన్లో ప్రయాణికులకు లభించే స్థలం కూడా దాదాపు ఇదే విధంగా కొనసాగింది. మొత్తంగా చూస్తే కొత్త ఫీచర్లతో ఇంటీరియర్‌ను మరింత ప్రీమియంగా మార్చే ప్రయత్నం చేశారు.
Level-2 ADASతో మరింత సేఫ్టీ
కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత ముఖ్యమైన అప్డేట్లలో Level-2 ADAS (Advanced Driver Assistance System) ఒకటి. ఈ సేఫ్టీ సూట్లో Adaptive Cruise Control, Lane Keep Assist, Automatic/Emergency Braking, High Beam Assist ఇతర డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు వంటివి ఉంటాయి. ఈ ఫీచర్ల కారణంగా డ్రైవింగ్ సమయంలో భద్రత మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో డ్రైవర్‌కు ADAS టెక్నాలజీ సహాయపడుతుంది.
6 ఎయిర్‌బ్యాగ్స్.. మరిన్ని సేఫ్టీ ఫీచర్లు
కొత్త బాలెనోలో అన్ని ట్రిమ్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించడం మరో కీలకమైన అంశం. దీనితో పాటు EBDతో కూడిన బ్రేకింగ్ సిస్టమ్, TPMS (Tyre Pressure Monitoring System), Hill Hold Assist వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
కొత్త 1.2 లీటర్ Z-Series పెట్రోల్ ఇంజన్
బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త 1.2 లీటర్ Z-Series పెట్రోల్ ఇంజన్ ను తీసుకొచ్చారు. ఇదే ఇంజన్‌ను మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్ వంటి మోడళ్లలో కూడా ఉపయోగిస్తోంది. ఇది 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. అయితే గత బాలెనోలో ఉన్న 1.2 లీటర్ K-Series ఇంజన్ 4-సిలిండర్ యూనిట్ కావడం గమనార్హం. కొత్త ఇంజన్‌తో పనితీరు, ఇంధన సామర్థ్యం, డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి పెట్టింది.
గేర్‌బాక్స్ ఆప్షన్లు
కొత్త బాలెనోలో ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో పెద్దగా మార్పులు చేయలేదు. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT) ఆప్షన్ అందుబాటులో ఉంది.
ధర రూ.6.10 లక్షల నుంచి
కొత్త Maruti Suzuki Baleno Facelift ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.10 లక్షలుగా ఉంది. కొత్త ఇంజన్, Level-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..