Site icon NTV Telugu

Natasa Stankovic: కొత్త కారు కొన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Natasa Stankovic

Natasa Stankovic

Natasa Stankovic New Car: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం నటాషా స్టాంకోవిచ్‌ తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పటి గ్లామర్‌ ఈవెంట్‌లకు, క్రికెట్‌ మ్యాచ్‌లకు తరచూ హాజరయ్యే నటాషా.. ఒంటరితనాన్ని ఎంచుకుట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ తనకిష్టమైన జీవితం వైపు తిరిగి అడుగులు వేస్తోంది. తనపై వస్తున్న వార్తలకు పెద్దగా స్పందించని నటాషా.. ఇప్పుడు వ్యక్తిగతంగా, ఆర్థికంగా స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కుమారుడు అగస్త్యను చూసుకుంటూనే, తన కెరీర్‌ మీద కూడా దృష్టి పెడుతోంది. మధ్యలో ఆమె ఒక వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లు వచ్చినా, ఆ వార్తలపై వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తన ప్రైవేట్‌ లైఫ్‌ను ఎవరితోనూ పంచుకోకుండా, మౌనంగా ముందుకు సాగిపోతోంది.

READ MORE: Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే నలుగురు..

తాజాగా నటాషా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నటాషా స్టాంకోవిక్ రూ.3.04 కోట్ల విలువైన కారును కొనుగోలు చేసింది. ఇది మామూలు కారు కాదు.. ల్యాండ్ రోవర్ డిఫెండర్‌. ఈ కొత్త కారు ఆరెంజ్ కలర్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ కారులో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. నవంబర్ 21న, ఈ మోడల్ జిమ్ నుంచి బయటకు వచ్చి ల్యాండ్ రోవర్ డిఫెండర్‌లో వెళ్లిపోయింది. నటాషా కొత్త కారు కొనుగోలు చేసిన వీడియోలు బయటకు రావడంతో మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. “ఇది హార్దిక్‌ వేసుకునే వాచ్‌ ధరకూ సరి చేరదు”, “నటాషా కంటే హార్దిక్‌ లైఫ్‌ లేవెల్‌ వేరే” అన్న ట్రోల్స్‌ వస్తున్నాయి.

READ MORE: Meena : ఏ హీరో విడాకులు తీసుకున్న నాకే లింక్ చేస్తున్నారు – మీనా ఫైర్

Exit mobile version