Site icon NTV Telugu

 బోల్డ్ లుక్స్.. శక్తివంతమైన ఇంజిన్! ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త MG Majestor..

Mg

Mg

MG Majestor: భారత ఎస్‌యూవీ మార్కెట్‌ను మలుపు తిప్పేందుకు ఎంజీ మోటార్ సిద్ధమవుతోంది. కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఎంజీ మేజెస్టర్‌ను తీసుకురాబోతోంది. ఈ కొత్త ఎస్‌యూవీని 2026 ఫిబ్రవరి 12న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ గ్లోస్టర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. చూడటానికి బలంగా, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు కోరుకునే కస్టమర్లుకు ఇది మంచి ఎంపిక. లాంచ్‌కు ముందే ఎంజీ మేజెస్టర్ గురించి ఆటో రంగంలో మంచి చర్చ మొదలైంది. ఈ ఎస్‌యూవీ డిజైన్ అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడయ్యే Maxus D90 నుంచి ప్రేరణ పొందింది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, గ్లోస్ బ్లాక్ ఫినిష్, నిలువుగా LED హెడ్‌లైట్లు మంచి లుక్ ఇస్తాయి. సన్నని ఐబ్రో స్టైల్ DRLలు, బ్లాక్ బంపర్, సిల్వర్ టచ్‌లు కలిసి ఈ ఎస్‌యూవీని మరింత రఫ్ అండ్ టఫ్‌గా చూపిస్తాయి.

READ MORE: OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!

సైడ్ నుంచి చూస్తే మందపాటి బాడీ క్లాడింగ్, డ్యూయల్ టోన్ 19 అంగుళాల అలాయ్ వీల్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రూఫ్ రైల్స్ కనిపిస్తాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు, బ్లాక్ బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, డ్యూయల్ ఎగ్జాస్ట్ స్టైల్ డిజైన్ ఉండటం వల్ల ఇది నిజంగా ప్రీమియం ఎస్‌యూవీలా కనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో మేజెస్టర్ ఇంటీరియర్‌ను పూర్తిగా చూపించలేదు. కానీ స్పై ఫొటోలు చూస్తే లోపలి భాగం కూడా Maxus D90 లాగానే ఉండొచ్చని అంచనా. పెద్ద 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టైలిష్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. గేర్ సెలెక్టర్ స్టీరింగ్ దగ్గరే ఉండొచ్చని చెబుతున్నారు. ఎంజీ మేజెస్టర్‌ను గ్లోస్టర్ కంటే మెరుగ్గా అధునాతన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. గ్లోస్టర్‌లోనే ప్యానోరమిక్ సన్‌రూఫ్, మూడు జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ చార్జింగ్, 12 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్ ఉన్న పవర్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్ ఉన్నాయి. మేజెస్టర్‌లో వీటికన్నా మరింత హైటెక్ ఫీచర్లు రావొచ్చని అంచనా.

READ MORE: The Dadasaheb Phalke biopic : మళ్లీ తెరపైకి రాజ్ కుమార్ హిరానీ- అమీర్ ఖాన్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్..

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది దాదాపు 216 హెచ్‌పీ పవర్, 479 Nm టార్క్ ఇస్తుంది. దీనితో పాటు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4WD సిస్టమ్ కూడా అందుబాటులో ఉండొచ్చు. మొత్తానికి MG మేజెస్టర్ భారత ఫుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో బలమైన ప్రత్యర్థిగా నిలవనుంది. ధర విషయానికి వస్తే ఇంకా అధికారిక ప్రకటన లేదు. కానీ ప్రారంభ ధర సుమారు 40 లక్షల రూపాయల దగ్గర ఉండొచ్చని అంచనా. లాంచ్ త

Exit mobile version