MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్‌లో గేమ్‌ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..

Mg Hector Tomahawk Ev

Mg Hector Tomahawk Ev

MG Hector Tomahawk EV: భారత కార్ల మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్‌ వాహనాల కంటే.. EVల మధ్య పోటీ తీవ్రం అవుతోంది.. కార్ మార్కెట్లో రోజురోజుకీ ఎలక్ట్రిక్ SUVల పోటీ మరింత పెరగబోతోంది. మహీంద్రా XEV సిరీస్‌కు పోటీగా JSW MG Motor India కొత్త 7-సీటర్ SUVని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. MG హెక్టర్ టోమాహాక్ EVగా పిలుస్తున్న ఈ కొత్త SUVని ఆగస్టు 26న భారత మార్కెట్లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. భారీ రేంజ్, అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ SUV మార్కెట్లోకి రానుంది.

ADAPT ప్లాట్‌ఫామ్‌పై తొలి కారు
JSW MG ఇటీవల ఆవిష్కరించిన ADAPT ప్లాట్‌ఫామ్ ఆధారంగా భారత్‌లో తయారయ్యే తొలి కారు ఇదే కానుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్‌లతో వాహనాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో భారత మార్కెట్లో MG తన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. అయితే, MG హెక్టర్ టోమాహాక్ EVని ఆగస్టు 26న విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఇండోనేషియా మార్కెట్లో అందుబాటులో ఉన్న వులింగ్ యాక్సియాన్కు రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చి, ఆ తర్వాత ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

రూ.20-30 లక్షల ధర ఉండొచ్చని అంచనా
ఈ కొత్త 7-సీటర్ SUV ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఇది కియా కేరెన్స్ క్లావిస్ EV, మహీంద్రా XEV 9S, భవిష్యత్తులో రానున్న టాటా సఫారీ EV వంటి ఎలక్ట్రిక్ SUVలకు పోటీ ఇవ్వనుంది.

530 కిలోమీటర్ల రేంజ్
MG అధికారికంగా పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రపంచ మార్కెట్లలో ఉన్న మోడల్ ఆధారంగా చూస్తే, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 69.2 kWh LFP బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో ఎలక్ట్రిక్ మోటార్ అమర్చి, సుమారు 201 hp పవర్, 310 Nm టార్క్ అందించే అవకాశం ఉంది. దీని క్లెయిమ్‌డ్ రేంజ్ సుమారు 530 కిలోమీటర్లుగా ఉండొచ్చు. ఇక, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5 kWh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సుమారు 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చని అంచనా. పెట్రోల్ ఇంజిన్, బ్యాటరీ కలిపి మొత్తం రేంజ్ 1,000 కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

7-సీటర్ EV సెగ్మెంట్‌లో గట్టి పోటీ
భారతదేశంలో 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో MG హెక్టర్ టోమాహాక్ EV భారీ రేంజ్, బహుళ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తే మార్కెట్లో గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్‌లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను భారత వెర్షన్‌లోనూ అందిస్తే ఈ కొత్త MG SUV వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే, MG హెక్టర్ టోమాహాక్ EVకి సంబంధించిన బ్యాటరీ, పవర్, రేంజ్, ధర వంటి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.. ఇప్పటి వరకు ఉన్న ఇవి అంచనా/ప్రపంచ మార్కెట్ మోడల్ ఆధారంగా ఉన్న సమాచారం మాత్రమే.