MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్లో గేమ్‌ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Hector Tomahawk EV: భారత కార్ల మార్కెట్లో డీజిల్, పెట్రోల్ వాహనాల కంటే.. EVల మధ్య పోటీ తీవ్రం అవుతోంది.. కార్ మార్కెట్లో రోజురోజుకీ ఎలక్ట్రిక్ SUVల పోటీ మరింత పెరగబోతోంది. మహీంద్రా XEV సిరీస్‌కు పోటీగా JSW MG Motor India కొత్త 7-సీటర్ SUVని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. MG హెక్టర్ టోమాహాక్ EVగా పిలుస్తున్న ఈ కొత్త SUVని ఆగస్టు 26న భారత మార్కెట్లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. భారీ రేంజ్, అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ SUV మార్కెట్లోకి రానుంది.
ADAPT ప్లాట్‌ఫామ్‌పై తొలి కారు
JSW MG ఇటీవల ఆవిష్కరించిన ADAPT ప్లాట్‌ఫామ్ ఆధారంగా భారత్‌లో తయారయ్యే తొలి కారు ఇదే కానుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వంటి విభిన్న పవర్ట్రెయిన్లతో వాహనాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో భారత మార్కెట్లో MG తన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. అయితే, MG హెక్టర్ టోమాహాక్ EVని ఆగస్టు 26న విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఇండోనేషియా మార్కెట్లో అందుబాటులో ఉన్న వులింగ్ యాక్సియాన్కు రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చి, ఆ తర్వాత ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
రూ.20-30 లక్షల ధర ఉండొచ్చని అంచనా
ఈ కొత్త 7-సీటర్ SUV ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది కియా కేరెన్స్ క్లావిస్ EV, మహీంద్రా XEV 9S, భవిష్యత్తులో రానున్న టాటా సఫారీ EV వంటి ఎలక్ట్రిక్ SUVలకు పోటీ ఇవ్వనుంది.
530 కిలోమీటర్ల రేంజ్
MG అధికారికంగా పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రపంచ మార్కెట్లలో ఉన్న మోడల్ ఆధారంగా చూస్తే, ఎలక్ట్రిక్ వెర్షన్లో 69.2 kWh LFP బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో ఎలక్ట్రిక్ మోటార్ అమర్చి, సుమారు 201 hp పవర్, 310 Nm టార్క్ అందించే అవకాశం ఉంది. దీని క్లెయిమ్డ్ రేంజ్ సుమారు 530 కిలోమీటర్లుగా ఉండొచ్చు. ఇక, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5 kWh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సుమారు 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చని అంచనా. పెట్రోల్ ఇంజిన్, బ్యాటరీ కలిపి మొత్తం రేంజ్ 1,000 కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
7-సీటర్ EV సెగ్మెంట్లో గట్టి పోటీ
భారతదేశంలో 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో MG హెక్టర్ టోమాహాక్ EV భారీ రేంజ్, బహుళ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తే మార్కెట్లో గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను భారత వెర్షన్లోనూ అందిస్తే ఈ కొత్త MG SUV వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే, MG హెక్టర్ టోమాహాక్ EVకి సంబంధించిన బ్యాటరీ, పవర్, రేంజ్, ధర వంటి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.. ఇప్పటి వరకు ఉన్న ఇవి అంచనా/ప్రపంచ మార్కెట్ మోడల్ ఆధారంగా ఉన్న సమాచారం మాత్రమే.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?