Mercedes-Benz: మెర్సిడెస్-బెంజ్ ఫ్యామిలీ కార్ల నిర్వచనాన్నే మార్చేందుకు సిద్ధం అవుతోంది. కంపెనీ రూపొందిస్తున్న కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ Mercedes-Benz VLE 500 కిలోమీటర్లకు మించిన డ్రైవింగ్ రేంజ్‌తో త్వరలోనే ప్రపంచ ఆటో మార్కెట్‌లో అడుగు పెట్టబోతుంది. ఈ 8 సీట్ల ఎలక్ట్రిక్ వాహనం 2026 మార్చి 10వ తేదీన జర్మనీలోని స్టుట్గార్ట్‌లో గ్లోబల్ డెబ్యూ చేయనుంది. విశాలమైన స్థలం, అత్యున్నత సౌకర్యాలు, సుదీర్ఘ ప్రయాణ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను అభివృద్ధి చేశారు.
Read Also: PM Modi: ‘‘అస్సాంను పాక్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర’’.. మోడీ వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఫైర్..
కొత్త VAN.EA ప్లాట్‌ఫామ్‌పై ఫస్ట్ వెహికిల్..
Mercedes-Benz రూపొందించిన VAN.EA అనే సరికొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న మొదటి వాహనం VLE కావడం విశేషం. భవిష్యత్తులో వచ్చే ఎలక్ట్రిక్ వ్యాన్లు, ఎంపీవీలకు ఇది బేస్‌గా ఉపయోగపడనుంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఎంట్రీ వేరియంట్లు సుమారు 268 హార్స్‌పవర్, టాప్ వేరియంట్లు దాదాపు 470 హార్స్‌పవర్ వరకు శక్తిని అందించనుంది.
Read Also: Former Maoist Arrested: మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్య అరెస్ట్..
ఇక, బ్యాటరీ సామర్థ్యం 90kWh నుంచి 120kWh వరకు ఉండే అవకాశం ఉంది. WLTP ప్రమాణాల ప్రకారం 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని మెర్సిడెస్-బెంజ్ వెల్లడించింది. అలాగే, అత్యాధునిక 800-వోల్ట్ సిస్టమ్తో 350kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉండటం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Read Also: Bollywood : రొమాంటిక్ హీరో నుండి గ్యాంగ్‌స్టర్ గా మారిన బాలీవుడ్ హీరో
కమర్షియల్ వినియోగానికి అనుకూలం..
VLE ఒక 8 సీట్ల ఎలక్ట్రిక్ ఎంపీవీగా రూపొందించారు. పెద్ద కుటుంబాలు, దూర ప్రయాణాలు చేసేవారు మాత్రమే కాకుండా, ఎయిర్‌పోర్ట్ షటిల్ సర్వీసులు, ప్రీమియం రైడ్-షేరింగ్ లాంటి కమర్షియల్ అవసరాలకు కూడా దీన్ని వినియోగించే వారికి కూడా అనుకూలంగా ఉండనుంది. సెడాన్‌లా మృధువైన రైడ్ కంఫర్ట్‌ను ఎలక్ట్రిక్ పవర్‌తో కలిపి అందించడమే ఈ వాహన ప్రత్యేకత.
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని VLEను వివిధ సీటింగ్, యూజ్ కాన్ఫిగరేషన్లలో రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొనింది. లగ్జరీపై ఎక్కువ ఫోకస్ చేసే వేరియంట్లతో పాటు ప్రయాణికుల సామర్థ్యం కలిగిన వేరియంట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఫ్యూచరిస్టిక్ డిజైన్ & హైటెక్ ఇంటీరియర్
డిజైన్ పరంగా VLE, Vision V కాన్సెప్ట్ నుంచి ప్రేరణ తీసుకున్నారు. టీజర్ చిత్రాల్లో స్టార్ ఆకారంలో ఉన్న LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, వాటిని కలుపుతూ ఉండే ఫుల్-విడ్త్ లైట్ బార్ కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సాంప్రదాయంగా ఉండేలా క్లోజ్డ్ గ్రిల్ డిజైన్ ఉండనుంది. కాన్సెప్ట్ కార్ రూపానికి దగ్గరగానే, ప్రాక్టికల్ మార్పులతో ప్రొడక్షన్ మోడల్ రూపొందించారు.
ఇక, ఇంటీరియర్ వివరాలను ఇంకా పూర్తిగా Mercedes-Benz వెల్లడించలేదు. అయితే, మెర్సిడెస్-బెంజ్ యొక్క కొత్త MB.OS సాఫ్ట్‌వేర్పై పని చేసే భారీ MBUX Hyperscreen ఉండే ఛాన్స్ ఉందని అంచనా. ఇది డ్యాష్‌బోర్డ్ అంతటా విస్తరించి, నావిగేషన్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్, వెహికిల్ సెట్టింగ్స్ వరకు అన్నింటినీ నియంత్రిస్తుంది. హయ్యర్ వేరియంట్లలో వెనుక సీట్ల ప్రయాణికుల కోసం ప్రత్యేక స్క్రీన్లు, ప్రీమియం కంఫర్ట్ ఫీచర్లను కూడా అందిస్తుంది.
