Mercedes-Benz S-Class: మెర్సిడెస్-బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ సెడాన్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. జనవరి 29వ తేదీన గ్లోబల్‌గా అధికారిక ఆవిష్కరణ జరగనుంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్, ఆధునిక సాంకేతిక ఫీచర్లను కంపెనీ సీఈఓ ఒలా కాలేనియస్ వెల్లడించారు. ఈ మిడ్-సైకిల్ అప్‌డేట్‌లో భాగంగా ఎస్-క్లాస్‌లో 50 శాతం కంటే ఎక్కువ భాగాలు కొత్తగా లేదా సవరించినవిగా ఉన్నాయని మెర్సిడెస్ తెలిపింది. బయట రూపకల్పనలో ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్లాస్ మరింత ఆకర్షణీయంగా మారింది.. మూడు పాయింట్ల స్టార్ క్రోమ్ డీటైలింగ్‌తో కొత్తగా రూపొందించిన గ్రిల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లలో మూడు పాయింట్ల స్టార్ ఆకారంలో ఎల్‌ఈడీ లైటింగ్ గైడ్స్ ఉండటం వల్ల ప్రత్యేకమైన విజువల్ ఐడెంటిటీ లభించింది.
Read Also: How Bombay Became Mumbai: ముంబైకి బాంబే అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా?
అయితే, కొత్త బంపర్లు, తాజా అలాయ్ వీల్ డిజైన్‌లు మెర్సిడెస్-బెంజ్ కార్ లగ్జరీ హంగును మరింత పెంచాయి. ముఖ్యంగా, 2000ల మధ్యకాలం తర్వాత కనిపించని ఐకానిక్ మెర్సిడెస్ హుడ్ ఆర్నమెంట్ మళ్లీ తిరిగి వచ్చింది. 2026 మోడల్‌లో ఇది లైటింగ్‌తో పాటు ప్రకాశించే గ్రిల్ అవుట్‌లైన్‌తో అందుబాటులోకి రానుంది. ఇక, ఇంటీరియర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ (MB.OS)ను ప్రవేశ పెట్టింది. కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన ఈ అధునాతన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ వాహనంలోని ఇన్ఫోటైన్‌మెంట్, ఫంక్షన్లు, కనెక్టివిటీ, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లను నియంత్రిస్తుంది. దీని వల్ల భవిష్యత్ అప్‌డేట్‌లకు అనుకూలంగా ఉండేలా కేబిన్‌ను సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్‌టు డేట్‌గా ఉంచుకోవచ్చు. అలాగే, వినియోగదారుల సౌకర్యం కోసం స్టీరింగ్ వీల్, స్విచ్‌గేర్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. టచ్ కంట్రోల్స్‌కు బదులుగా ఓపెన్ బటన్‌లు తిరిగి వచ్చే సూచనలు వినిపిస్తున్నాయి.
Read Also: Anil Ravipudi: 10వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..
ఇక, ఈ కారులో సాంకేతిక అంశాల్లో, ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్లాస్‌లో మెరుగుపరచిన అడాప్టివ్ ఎయిర్‌మాటిక్ సస్పెన్షన్ మెర్సిడెస్-బెంజ్ అందనుంది. ఇందులో కొత్తగా జోడించిన ఐడ్యాంపింగ్ (iDamping) ఫీచర్ రోడ్డుపై ఉన్న లోపాలను గుర్తించి, ఆ సమాచారాన్ని ఇతర ఎస్-క్లాస్ వాహనాలతో పంచుకుంటుంది. దీని ద్వారా వాహనం ముందుగానే సస్పెన్షన్‌ను సర్దుబాటు చేసుకుని ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, కొత్త ఎస్-క్లాస్ లెవల్-4 ఆటోనమస్ డ్రైవింగ్‌కు సిద్ధంగా ఉంటుందని మెర్సిడెస్ సీఈఓ వెల్లడించారు. ఇప్పటికే ప్రజా రహదారులపై ఈ స్వయంచాలక డ్రైవింగ్ సాంకేతికతను పరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఆటోనమస్ టెక్నాలజీ, లగ్జరీ విభాగాల్లో ప్రపంచంలో ముందుండాలన్న మెర్సిడెస్-బెంజ్ లక్ష్యాన్ని ఈ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
